హీరోయిన్ మనాలీ కలప ఇల్లు కూలేట్టుంది!

0

అమ్మ జయలలిత బయోపిక్ ప్రస్తుతం హాట్ టాపిక్. క్వీన్ కంగన రనౌత్ టైటిల్ పాత్ర పోషిస్తున్న బయోపిక్ విషయమై అటు కోలీవుడ్ సహా ఇటు టాలీవుడ్ లోనూ వాడి వేడిగా చర్చ సాగుతోంది. ఇటీవల అమెరికాలో లుక్ టెస్టులు పూర్తి చేసుకున్న కంగన ప్రస్తుతం శీతల ప్రదేశం అయిన మనాలీ(హిమచల్ ప్రదేశ్ హిల్ స్టేషన్ ) లోని తన ఖరీదైన కలప ఇంట్లో భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తోంది.

ఈ జనవరి నాటికి కులు మనాలీ అంతా మంచులో కూరుకుపోతుంది. అక్కడ చలి తట్టుకోవడం కూడా కష్టమే. ముఖ్యంగా డీప్ ఫ్రీజర్ లో పెట్టినట్టు మైనస్ డిగ్రీల చలిని తట్టుకోవాల్సి ఉంటుంది. అయినా కంగన మాత్రం ఈ వాతావరణానికి అదరక బెదరక ఇలా నాట్యం ప్రాక్టీస్ చేస్తోంది. తాను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఖరీదైన బంగ్లాలో ఇలా థై తై నాట్యం ఆడేస్తోంది. తనకు ప్రత్యేకించి శిక్షణనిచ్చేందుకు సుశిక్షితురాలైన సాధకురాలే దొరికిందని అర్థమవుతోంది.

‘క్వీన్ కి విరామం లేదు. నిరంతరం మనాలి ఇంట్లో భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తోంది. ఎపిక్ సాగా కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నా’ అంటూ కంగన ఈ వీడియోతో పాటుగా ఆసక్తికర వ్యాఖ్యను పోస్ట్ చేసింది. అంతా బాగానే ఉంది కానీ… మరీ ఎక్కువ నాట్యమాడేస్తే అంత మంచిది కాదేమో.. అసలే కలప ఇల్లు డెలికేట్ జాగ్రత్త
Please Read Disclaimer