ఆ హీరోతో డేటింగ్.. మళ్లీ గుర్తు చేసుకుందా?

0

ప్రేమ పెళ్లి లాంటి వ్యవహారాలపై ఏదీ దాచుకోవడం లేదు నేటితరం నాయికలు. తాము పెళ్లాడబోయే వాడు ఇలా ఉండాలి! అలా ఉండాలి!! అనే కండీషన్లను పెడుతున్నారు. `ప్రేమ కావాలి` ఫేం ఇషా చావ్లా సైతం ఈ విషయం లో ఏమాత్రం దాగుడు మూతలు ఆడడం లేదు. తన జీవితం లో ఎఫైర్ల గురించి పెళ్లి ఆలోచనల గురించి తనకు తానుగానే ఓపెన్ అయి పోయింది.తనకు ఇద్దరి తో ఎఫైర్ ఉందని ఓపెనైన ఇషా చావ్లా .. ఒకరితో ఐదారేళ్ల పాటు నిండా ప్రేమలో ఉన్నానని .. అలాగే వేరొకరితో చిన్నపాటి రిలేషన్ షిప్ కొనసాగించానని తెలిపింది. ప్రస్తుతానికి తాను సింగిల్ గా ఉన్నానని.. పెళ్లాడే సమయం వస్తే తాను సిద్ధమేనని వెల్లడించింది. సరదాగా నిజాయితీగా నవ్విస్తూ ఉండే వాడు తనవాడు కావాలని ఆకాంక్షను బయట పెట్టేసింది. ఇక సామాజిక మాధ్యమాల్లో తనకు పెళ్లయిపోయిందని ప్రచారమైనా ఆశ్చర్యపోనని ఇషా అనడం కొసమెరుపు.ఇషా చావ్లా కెరీర్ ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉంది. తెలుగులో పూర్తిగా జీరో. తెలుగులో ఓ టాప్ కమెడియన్ కం హీరోతో ఎఫైర్ సాగించిందన్న ప్రచారం తెలిసినదే. తన బ్యాక్ గ్రౌండ్ సంగతి చూస్తే దిల్లీలో జన్మించిన ఇషా చావ్లా 2007 లో ప్రేమ కావాలి అనే చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆది సాయికుమార్ సరసన నటించింది. ప్రముఖ దర్శకుడు విజయ భాస్కర్ తెరకెక్కించారు. అటుపై సునీల్ సరసన `పూల రంగడు` చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఈ 32 ఏళ్ల నటి `శ్రీమన్నారాయణ` చిత్రంలో నందమూరి బాలకృష్ణతో రొమాన్స్ చేసింది. ఇషా డిజిటల్ షోలు.. మోడలింగ్ వ్యవహారాలు తెలిసిందే. ఇషా చావ్లా తన అమన్య ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవ చేస్తోంది.

ఇషా చావ్లా పొలిటికల్ సైన్స్ విద్యార్థి .. అటుపై థియేటర్ ఆర్టిస్ట్ గా రాణించింది. ముంబైలోని ఒక ప్రముఖ థియేటర్ గ్రూపుతో తన నట జీవితాన్ని ప్రారంభించింది. దీనికి ముందు.. ఆమె లాజ్ పత్ నగర్ లోని ప్రసిద్ధ బారీ జాన్ యాక్టింగ్ స్టూడియోలో నటనలో మూడు నెలల శిక్షణ తీసుకుంది. అటుపై కొన్ని టీవీ వాణిజ్య ప్రకటనలలో కనిపించింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘తనూ వెడ్స్ మను’ తెలుగు రీమేక్ లో కంగనా రనౌత్ పాత్రను పోషించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. తొలి సినిమా ప్రేమ కావాలి విజయం సాధించాక పలు ఆఫర్లను పొందినా థియేటర్ పై ఇషాకు ఉన్న మక్కువ వల్ల తిరిగి గుర్గావ్ కు వెళ్లి.. కొన్ని ప్రదర్శనలు ఇచ్చింది. అటుపై రీఎంట్రీలో ఆశించినంత ఎత్తుకు ఎదగలేకపోయింది.
Please Read Disclaimer