గుస గుస: పొట్టి హీరోయిన్ గట్టిదే!

0

అనుకోకుండా టాలీవుడ్ లో అడుగు పెట్టింది. వస్తూనే అందలం అందుకుంది. తొలి మలి బంపర్ హిట్లతో ఇప్పుడు టాలీవుడ్ ని ఊపేస్తోంది. అందానికి అందం అంతకుమించిన అభినయంతో అదరగొడుతోంది. తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకుంది. దీంతో దర్శక హీరోలంతా ఈ అమ్మడి నామమే జపిస్తున్నారు. ఉవ్వెత్తున టాలీవుడ్ లో ఎగసిన ఈ యువ మందాకిని పట్టిందల్లా బంగారమవ్వడంతో గోల్డెన్ హ్యాండ్ గా వెలిగిపోతోంది. పట్టుమని పాతిక ప్రాయం అయినా రాలేదు. 23 ఏళ్ల కుర్ర భామ బోయ్స్ లో సెగలు పుట్టిస్తోంది. ఆరంభమే సక్సెస్.. వరుస విజయాలు దక్కడంతో ఈ బ్యూటీ స్పీడ్ ను ఎవరూ ఆపలేని సన్నివేశం కనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇద్దరు అగ్ర హీరోల చిత్రాల్లో నటిస్తోంది. మరో యంగ్ హీరో సరసన ఓ సినిమా చేస్తోంది.

ఇంకా మరెన్నో అవకాశాలు క్యూ కట్టాయి. తన కోసం హీరోలే వెయిట్ చేస్తున్న సీన్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ అవ్వాలంటే కటౌట్ తో పాటు కొన్ని క్వాలిటీస్.. క్వాలిఫికేషన్స్ ఉండాలంటారు. కానీ ఆ హీరోయిన్ లో కొన్ని లోపించినా అవేవీ కనిపించడం లేదు ఎవరికీ. హీరోయిన్ రేంజ్ కటౌట్ కాదు. ఆరడుగుల ఎత్తు ఉండే మన హీరోల హైట్ కు తగ్గ ఎత్తు లేదు. అలాగే ఆ రేంజు వెయిట్ కూడా లేదు. ముఖ్యంగా సినిమాల్లో రాణించాలంటే హీరోలకు తగ్గ హైట్ కీ రోల్ పోషిస్తుంది.

కానీ ఆ అమ్మడిలో ఆ క్వాలిటీ లేకపోయినా తన పొట్టితనమే కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. హైట్ తక్కువ గల చాలా మంది భామలు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. కానీ సక్సెస్ అయింది లేదు. సక్సెస్ అయిన వాళ్లంతా మోడలింగ్ రంగంలో ఆరితేరిన వారు. వాళ్లంతా మంచి హైట్… శరీర సౌష్టవాన్ని మెయింటెయిన్ చేసిన వాళ్లే. కానీ ఈ పొట్టి హీరోయిన్ లో అవన్ని లోపించినా టాలీవుడ్ ని ఏల్తోంది. మరి దీనిని అదృష్టం అనాలా? లేక ట్యాలెంట్ తోనే నెట్టుకొస్తుందని భావించాలా?. ఈ పొట్టిది మాత్రం మహా గట్టిది అని మాత్రం ఫిక్సయిపోవచ్చు.
Please Read Disclaimer