అమ్మగా హీరోయిన్ ఆనందక్షణాలు

0

బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సౌత్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన సమీరా రెడ్డి నాలుగు సంవత్సరాల క్రితం తన మొదటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఈఏడాది జులై 12న సమీరా తన రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. మొదట బాబు కాగా రెండవ సారి పాపకు జన్మనిచ్చింది. పాప పేరు నైరా అంటూ పేరు పెట్టింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సమీరా రెడ్డి ఎప్పటికప్పుడు తన పిల్లలు మరియు తన ఫొటోలను షేర్ చేస్తూనే ఉంది.

రీసెంట్ గా సమీరా కూతురు నైరాను ఎత్తుకుని చాలా సంతోషంగా ఉన్న ఒక ఫొటోను పోస్ట్ చేసింది. అమ్మగా ఆనందక్షణాలను అనుభవిస్తున్నట్లుగా ఈ ఫొటోలో సమీరాను చూస్తుంటే అనిపిస్తుంది. ఎంత ఖర్చు చేసినా ఆనందం అమ్మతనంలో ఉంటుందంటారు. తమ పిల్లలను ఆడించేప్పుడు.. ఆ పిల్లలు పెరిగి పెద్ద వారు అవుతున్న సమయంలో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. ఇప్పుడు సమీరా రెడ్డి దంపతులు కూడా అదే ఆనందంలో ఉన్నారు.

నైరా ఫొటోను షేర్ చేసిన సమీరా రెడ్డి ఆడపిల్లల గురించి ఎమోషనల్ గా కామెంట్ పెట్టింది. మన దేశంలో ఆడ పిల్లలను ఎందుకు భారంగా భావిస్తున్నారో నాకు ఇప్పటికి అర్థం కావడం లేదు. ఉన్నత శ్రేణి కుటుంబాల వారు కూడా మొదటి సంతానంగా అబ్బాయి కావాలని కోరుకుంటున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అందరి మైండ్ సెట్ మారాలని ఆశిస్తున్నాను. మా ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ పోస్ట్ చేసింది.
Please Read Disclaimer