ప్రియుడి దెబ్బకు షూటింగ్ నుంచి పారిపోయిన హీరోయిన్?

0

టాలీవుడ్ లో ఇలాంటివి అస్సలు వినిపించవు. ఈ కొరతను తీర్చేలా కోలీవుడ్ లో తరచూ చిత్రవిచిత్రమైన విషయాలు చోటు చేసుకోవటమే కాదు.. చిత్ర పరిశ్రమకు సంబంధించి ఆసక్తికర విషయాలకు అస్సలు కొదవ ఉండదని చెప్పాలి. తాజాగా అలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. షూటింగ్ స్టార్ట్ అయిన రెండో రోజునే హీరోయిన ఒకరు జంప్ అయిపోయిన ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.

కళా దర్శకుడు తోట తరణి దగ్గర సహాయకుడిగా పని చేసిన ఆరురాజా తాజాగా బాబీలోన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎవరీ ఆరురాజా అంటారా? మోస్ట్ సక్సెస్ ఫుల్ చిత్రం.. రజనీ ఇమేజ్ ను మరో మెట్టుకు తీసుకెళ్లిన చంద్రముఖి చిత్రంలో టైటిల్ పాత్ర బొమ్మల్ని గీసింది ఆయనే.

బాబీలోన్ చిత్రం స్పెషల్ ఏమంటే.. తానే హీరో.. తానే దర్శకుడిగా ఆరురాజా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర కథ ఫుల్ సెంటిమెంట్ అంటున్నారు. తండ్రి మరణించినా.. కుటుంబానికి ఆ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకునే హీరోకు అనుకోని సమస్య ఎదురవుతుంది. తన చెల్లెలకు సంబంధించిన ఒక వీడియోతో ఒక ముఠా బెదిరిస్తూ ఉంటుంది. ఒక దశలో హీరో చెల్లెల్ని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ విషయాన్ని హీరోకు చెప్పటంతో పాటు.. ఆమె చెల్లెలున్న దారుణ పరిస్థితి గురించి చెబుతుంది హీరోయిన్. తన చెల్లిల్ని హీరో ఎలా కాపాడుకున్నాడన్నది బాబీలోన్ చిత్రకథగా చెబుతారు.

ఈ చిత్రంలో హీరోయిన్ గా ఒక నటిని అనుకున్నారు. ఆమెతో షూటింగ్ స్టార్ట్ చేసిన రెండో రోజునే.. ఆమె లవ్వర్ టార్చర్ తట్టుకోలేక షూటింగ్ నుంచి జంప్ అయినట్లుగా చెబుతున్నారు. దీంతో షాక్ తిన్న టీం.. చివరకు శ్వేతా జోయల్ ను ఎంపిక చేశారు. తన తల్లికి ఒంట్లో బాగోలేదని షూటింగ్ నుంచి వెళ్లిపోయిన సదరు నటి కంటే.. శ్వేతా పాత్రలో ఒదిగిపోయినట్లుగా దర్శకుడు ప్రశంసిస్తుండటం గమనార్హం.
Please Read Disclaimer