మిగతా వాళ్ళకంటే.. సాయిపల్లవి అందుకే హైలైట్ అవుతోందా..?

0

టాలీవుడ్ నేచురల్ స్టార్లు నాని సాయిపల్లవి మూడేళ్ల కిందట `ఎమ్సీఏ` సినిమాలో చేసిన సందడి అంతా అందరికీ గుర్తుండే ఉంటుంది. తమ సహజ నటనతో ఈ జంట తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే త్వరలోనే మరోసారి వీరిద్దరూ కలిసి నటించబోతున్నారట. ‘ఎంసిఏ’ సినిమాలో కలసి నటించిన నాని సాయిపల్లవి జంట మరోసారి త్వరలో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నటించనున్నారట. రాహుల్ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయనున్నాడు. దీనికి ‘శ్యాం సింగ రాయ్’ అనే టైటిల్ కూడా నిర్ణయించారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో సాయిపల్లవి నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ సాయిపల్లవితో సంప్రదింపులు జరుపుతోందట.

ఇక ఆ పాత్ర కూడా సాయిపల్లవికి బాగా నచ్చిందనీ సమాచారం. శ్యామ్ సింగరాయ్ సినిమాలో కథానాయిక పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందనీ అందుకే ఆమె ఒప్పుకుందని అంటున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అవసరం అవుతారట. కాగా ఫస్ట్ హీరోయిన్ గా సాయిపల్లవిని ఫిక్స్ చేశారట చిత్రయూనిట్. అయితే మిగతా ఇద్దరు హీరోయిన్లు ఎవరనేది తెలియాల్సి ఉంది. విషయం ఏంటంటే సాయిపల్లవి పక్కన నటించడానికి హీరోహీరోయిన్లు భయపడుతున్నారట. ఎందుకంటే ఆమెతో నటిస్తే తన సహజ నటనతో తానే హైలైట్ అవుతుందని వాపోతున్నారు.

ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా కాస్తో కూస్తో గ్లామర్ షో చేయక తప్పదు. కానీ అమ్మడు కొంచం కూడా గ్లామర్ ఒలికించకుండా మిలియన్లలో అభిమానులను బుట్టలో వేసుకుంటుంది. అందుకు కారణం ఆమె నేచురల్ బ్యూటీ. ఎలాంటి సీన్ అయినా ఈ భామే క్రెడిట్ కొట్టేస్తుందని భావిస్తున్నారట. అయితే మరి స్టార్ హీరోయిన్లు అయితే సెకండ్ హీరోయిన్ గా ఒప్పుకోరు. మరి మిగిలిన ఆ ఇద్దరి స్థానాలలో ఎవరు రానున్నారనేది ప్రశ్నగా మిగిలింది. చూడాలి మరి అమ్మడు మళ్లీ తన నటనతో ఫ్యాన్స్ మనసు దోచుకుంటుందేమో.. కానీ నానిని చూసైనా హీరోయిన్స్ ముందుకు వస్తారని దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer