యాక్సిడెంట్ పై హీరోయిన్ కొత్త ట్విస్టు

0

తమిళ బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్.. నోటా ఫేం హాట్ హీరోయిన్ ఆషికా ఆనంద్ వివాదం గురించి తెలిసిందే. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడంతో ఆషికా ప్రయాణిస్తున్న కార్ ఓ యువకుడిని ఢీకొట్టిందని ప్రచారమైంది. శనివారం అర్ధరాత్రి ఆషికా ఆనంద్ తన స్నేహితులతో కారులో లాంగ్ డ్రైవ్ కి వెళ్లింది. అయితే వారు ప్రయాణిస్తోన్న కారు నుంగబాక్కమ్ ప్రాంతంలో యాక్సిడెంట్ కు గురైందిట. ఆ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతివేగం కారణంగా డ్రైవర్ కార్ స్పీడ్ ను అదుపు చేయలేకపోయాడు. దీంతో భరత్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్ ని ఢీకొట్టి కారు ఓ దుకాణంలోకి దూసుకుపోయిందని తమిళ మీడియాలో ప్రచారమైంది.

డెలివరీ బాయ్ కి తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే ఈ ఘటనలో ఆషికా అనంద్ స్పాట్ నుంచి పరారైందని.. మానవత్వం లేకుండా అలా చేసినందుకు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారమైంది. ఆ సమయంలో ఆషికా తన స్నేహితులు కలిసి ఫుల్ గా మద్యం సేవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎవరూ లేని ప్రదేశం కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పిందని లేదంటే ప్రమాదం ఊహించని విధంగా ఉండేదని స్థానికులు పోలీసులకు వెల్లడించారు. పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆషికా కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.

అయితే అసలు ఈ ఘటనలో వాస్తవమేంటి? అని ఆరాతీస్తే కొన్ని ఆసక్తికర సంగతులు తాజాగా తెలిశాయి. అసలు ఈ ఘటనలో జరుగుతున్న ప్రచారం లో నిజం లేదు. ప్రమాదం జరిగిన కార్ లో తను లేనని ఆషికా చెబుతున్నారు. ఆ ప్రమాద స్థలంలో యువకుడిని రక్షించేందుకు తన కార్ ని ఆపానని చెబుతున్నారు ఆషిక. రక్షించబోతే తిరిగి తననే ఇరికించారన్న ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే ఈ కేసులో నిజానిజాలేమిటో పోలీసులే నిగ్గు తేల్చాల్సి ఉంది.