చిట్టి పొట్టి నిక్కరులో చిట్టెమ్మలు

0

అందంతో కవ్వించడం.. యూత్ ని టెంప్ట్ చేయడం.. తద్వారా సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్ ని పెంచుకోవడం .. ఇదో ట్రెండ్ గా మారింది. బాలీవుడ్ లో ఇబ్బడిముబ్బడిగా నటవారసులు బరిలో దిగుతుంటే వీళ్ల మధ్య పోటీ అదే రేంజులో ఉంది. సదరు కుర్రభామలంతా డెబ్యూ నాయికలుగా రాణించేందుకు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. అయితే కథానాయికగా రాణించాలంటే అంత సులువా? ఫాలోయింగ్ అసాధారణంగా పెంచుకోవాలి.

ఫాలోవర్స్ పెరగాలంటే అందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలో ఈ అమ్మణ్ణులకు తెలిసినంతగా ఎవరికీ తెలీదేమో. ప్రతిసారీ ఏదైనా ఫంక్షన్ కి వెళ్లినప్పుడో లేక పార్టీలో పబ్బులో అంటూ తిరిగేప్పుడో.. లేక జిమ్ కి వెళ్లేప్పుడో ఎలా మేకప్ అయితే తమను యూత్ ఫాలో అవుతారో అలానే ప్రిపేరవుతున్నారు. చిట్టి పొట్టి నిక్కర్లతో .. కురచగా ఉండే ఫ్రాకుల్లో.. టైట్ స్పోర్ట్స్ డ్రెస్సులతో వీధుల వెంట ట్రీటిస్తుంటే జనం గుంపుగా మీద పడేంత ఫాలోయింగ్ వచ్చేస్తోంది.

ఇప్పటికిప్పుడు బాలీవుడ్ లో అరడజను పైగానే కుర్ర నాయికలు లక్ చెక్ చేసుకుంటున్నారు. శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్.. సైఫ్ ఖాన్ నటవారసురాలు సారా అలీఖాన్ ఇప్పటికే లక్ చెక్ చేసుకున్నారు. కెరీర్ పరంగా బిజీ అయిపోయారు. ఈ భామలు నిరంతరం కుర్రాళ్ల అటెన్షన్ తమవైపే ఉండేలా ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇక ఈ భామల వరుస చూస్తుంటే ఒకరితో ఒకరు పోటీపడుతూ పొట్టి నిక్కర్లతో నిరంతరం ట్రీటిస్తున్నారు. ఇక కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో పరిచయం చేసిన అనన్య పాండే (చుంకీ పాండే వారసురాలు) .. తారా సుతారియా సైతం పొట్టి నిక్కర్లు .. కురచ ఫ్రాకుల్లో నిరంతరం ఏదో చోట సందడి చేస్తున్నారు.

ఇక వీళ్లందరితో పోటీపడేందుకు దూసుకొస్తున్న పలువురు బాలీవుడ్ స్టార్ల నటవారసురాళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా కింగ్ ఖాన్ షారూక్ నటవారసురాలు సుహానా ఖాన్ ఇటీవల అంతర్జాలాన్ని హీటెక్కిస్తోంది. కథానాయిక అవ్వాలన్న ఆకాంక్షతో ఈ అమ్మడు ఇప్పటికే నటశిక్షణ తీసుకుని రెడీగా ఉంది. త్వరలోనే డెబ్యూ సినిమాకి ముహూర్తం ఫిక్స్ చేయనున్నారు. ఈలోగానే బోయ్స్ ని టెంప్ట్ చేసేందుకు సుహానా చేయని ప్రయత్నం అంటూ లేదు. తన గర్ల్ గ్యాంగ్ లో మునుముందు హీరోయిన్లు అయ్యే పలువురిని కలుపుకుని సుహానా అంతర్జాలంలో చెలరేగుతోంది. నిరంతరం చిట్టి పొట్టి నిక్కర్లతో సందడి చేస్తూ రకరకాల వీడియోలతో హీటెక్కిస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది.
Please Read Disclaimer