నాగ్ సినిమా కు నో చెప్తున్న హీరోయిన్లు?

0

టాలీవుడ్ లో సీనియర్ హీరోల సంఖ్య ఎక్కువే ఉంది. అయితే సీనియర్ హీరోల సరసన నటించేందుకు ఎక్కువమంది హీరోయిన్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో సీనియర్ స్టార్ హీరోల సినిమాకు హీరోయిన్ల ఎంపిక ఫిలిం మేకర్లకు కష్టంగా మారుతోంది. ప్రస్తుతం అక్కినేని నాగార్జునకు కూడా ఇదే సమస్య ఎదురవుతోందని సమాచారం.

నాగ్ ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ అనే యాక్షన్ ఫిలిం లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఏసిపీ విజయ్ వర్మ అనే పాత్రలో కనిపిస్తారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నాగ్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో నాగార్జున భార్య పాత్ర కోసం నిర్మాతలు పాపులర్ హీరోయిన్ల ను సంప్రదిస్తే వారు ఆసక్తి చూపించలేదట. ఇద్దరు హీరోయిన్లు ఇప్పటికే ‘వైల్డ్ డాగ్’ ఆఫర్ ను తిరస్కరించారట. దీంతో నాగార్జున కు జోడీకోసం నిర్మాతలు మరో హీరోయిన్ కోసం వెతుకుతూ ఉన్నారట.

నిజానికి సీనియర్ స్టార్ హీరోలలో ఇప్పటికీ ఫిట్నెస్.. లుక్స్ పరంగా నాగ్ మిగతావారికంటే ముందుంటారు. అయితే సీనియర్ హీరోలతో నటిస్తే ఇతర యంగ్ హీరోల సినిమాలకు తమను పట్టించుకోరనే భయంతో కొంతమంది హీరోయిన్లు వెనకడుగు వేస్తున్నారని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కినేని వారితో రొమాన్స్ చేసేందుకు ఎవరు ముందుకు వస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.
Please Read Disclaimer