వీడియో: సో క్యూట్ గా కుమ్మేశారుగా..

0

మహేష్ నటిస్తున్న `సరిలేరు నీకెవ్వరు` ఈ సంక్రాంతి బరి లోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్.. పోస్టర్లు ఆకట్టుకున్నాయి. మిలటరీ నేపథ్యం కర్నూల్ బ్యాక్ డ్రాప్ కథతో ఆద్యంతం రక్తి కట్టించే ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ని కామెడీ పంథాలో అనిల్ రావిపూడి రూపొందిస్తున్నారు. ఈ చిత్రం పై మహేష్ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన పాటలు మంచి ఆదరణ పొందుతున్నాయి.

ఇటీవల విడుదల చేసిన `హీ ఈజ్ సో క్యూట్…` పాటకు రష్మిక రచ్చ తెలిసిందే. ఈ పాటలో మహేష్ ని రష్మిక చాలా ఈజ్తో ఆటపట్టించేసింది. అయితే ఈ పాటని యంగ్ డ్యాన్సర్స్ శ్వేతా నాయుడు- నాయని పావని తమ స్టైలీ స్టెప్పులతో కుమ్మేశారు. డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్స్ తో మెస్మరైజింగ్ స్టెప్స్ తో అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

అనిల్ సుంకర తో కలిసి దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 11 న రిలీజ్ అంటూ ప్రచారమైంది. అయితే తేదీని మార్చే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం వేడెక్కిస్తోంది. ఇకపోతే దేవీశ్రీ .. సో క్యూట్ ట్యూన్ ఇలా వైరల్ అవ్వడం చూస్తుంటే.. విమర్శలకు చెక్ పెడుతూ.. అతడి బీట్ సక్సెసైనట్టే కదా!
Please Read Disclaimer