హేయ్ మెనీనా..నాగ్ సర్ రొమాన్స్ పీక్స్!

0

ఈ ఏజ్ లో నీకు పెళ్లేంటి? అంటూ సెటైర్లు ఓ వైపు.. గుట్టు చప్పుడు కాకుండా చిలక్కొట్టుడు ఇంకోవైపు.. `మన్మధుడు 2` టీజర్ లోనే నాగ్ క్యారెక్టర్ తో పాటు కథ గుట్టు విప్పేశారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. నాగార్జున హీరోగా నటిస్తున్న `మన్మధుడు 2` ఎలా ఉండబోతోందో అందరికీ ముందే తెలిసిపోయింది. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ అల్ట్రా మోడ్రన్ గాళ్ గా కనిపించబోతోంది. అంతకుమించి చెలరేగే అందగత్తెలు కనిపించబోతున్నారని తాజా విజువల్స్ చెబుతున్నాయి.

లేటెస్ట్ గా `మన్మధుడు 2` నుంచి `హేయ్ మెనీనా..` అంటూ సాగే లిరికల్ వీడియో రిలీజైంది. ఈ వీడియోలో నాగ్ రొమాన్స్ పీక్స్ అనే చెప్పాలి. టైటిల్ కి తగ్గట్టే అందమైన అమ్మాయిలతో కింగ్ ప్రతి ఫ్రేమ్ లోనూ రొమాన్స్ చేస్తూ కనిపించారు. లవ్ చేయను.. ఓన్లీ లవ్ మేక్ చేస్తా! అంటూ మన్మధుడు అసలు సంగతిని చెప్పకనే చెప్పేశాడు. చైతన్ భరద్వాజ్ ఇచ్చిన బాణి పెప్పీగా ఆకట్టుకుంది. ట్రెడిషనల్ బీట్ కి వెస్ట్రన్ స్టైల్ ని మిక్స్ చేసి ఈ బాణీని రూపొందించారు. అద్భుతమైన ఫారిన్ లొకేషన్లలో నాగార్జునపై చిత్రీకరించిన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.

వెన్నెల కిషోర్ పాత్రకు సంబంధించిన ఇంట్రో ఈ పాటలో ఆకట్టుకుంది. “అయినా అంత సులువుగా ఎలా పడేస్తార్ సర్ అమ్మాయిల్ని?“ అంటూ వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇస్తే.. `పడేయడమేంట్రా.. ఆ మాటంటేనే చిరాకు!` అంటూ మన్మధుడి కలరింగ్ బావుంది. ఇలా సందర్భానుసారం వచ్చే పాటల్లోనే కథను.. నాగ్ క్యారెక్టర్ ని డ్రైవ్ చేశారని అర్థమవుతోంది. ఈ విజువల్స్ లో నాగ్ ఏజ్ సగానికి సగం తగ్గిపోయింది. హేయ్ మెనీనా లిరిక్ ని శుభమ్ విశ్వనాథ్ రాశారు. ర్యాపర్ మేఘరాజ్ రవీంద్ర పాటను ఆలపించారు. మన్మధుడు 2 ట్రైలర్ జూలై 25న రిలీజవుతోంది. ఆగస్టు 9న సినిమా విడుదల కానుంది.
Please Read Disclaimer