సాహో టికెట్ల రేట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం?

0

క్రేజీ సినిమా విడుదల అవుతుందంటే చాలు.. టికెట్ల ధరల్ని పెంచేలా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునే విషయంలో ఏపీలో ఒక అలవాటుగా మారింది. అదే సమయంలో.. ఇలాంటి పప్పులు తన దగ్గర చెల్లవని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయటంతో.. రేట్ల పెంపు ప్రతిపాదన రావటం.. దాన్ని ప్రభుత్వం రిజెక్ట్ చేయటం ఈ మధ్యన మామూలైంది.

ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ మూవీ సాహో రిలీజ్ ఇప్పుడెంత హాట్ టాపిక్ గా మారిందో తెలిసిందే. ఈ సినిమా కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ సినిమా మీద ఉన్న క్రేజ్ తో పాటు.. భారీ బడ్జెట్ తో తీసిన సినిమా కావటంతో.. తాము పెట్టిన పెట్టుబడిని త్వరగా వెనక్కి తెచ్చుకునేందుకు పనిలో భాగంగా టికెట్ల ధరల్ని పెంచాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరటం.. అందుకు ఓకే చెప్పేస్తూ ఆర్డర్ పాస్ చేశారు.

సాహో చిత్ర టికెట్ల ధరల్ని భారీగా పెంచేస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ నిర్మాత నట్టికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా టికెట్ ధర రూ.300 వరకు పెంచటంపై ఫైర్ అయిన ఆయన.. ప్రేక్షకుల వీక్ నెస్ ను చిత్ర నిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారంటూ వారి ప్రయత్నాల్ని అడ్డుకోవాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై స్పందించిన న్యాయస్థానం తాజాగా సాహో చిత్ర నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లకు నోటీసులు జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఏపీ హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి.. విశాఖ పోలీస్ కమిషనర్.. సాహో చిత్ర పంపిణీ దారు దిల్ రాజుకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఈ రోజు (బుధవారం) హైకోర్టులో జరగనుంది. ఇదిలా ఉంటే.. ఏపీ ప్రభుత్వానికి భిన్నంగా సాహో టికెట్ల ధర పెంపుపై తెలంగాణ ప్రభుత్వం నో చెప్పేయటంతో తెలంగాణ వ్యాప్తంగా మామూలు ధరలకే టికెట్లను అమ్మాల్సిన పరిస్థితి ఉంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home