బ్రేకింగ్ : వర్మ సినిమాకు హైకోర్టు షాక్

0

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగితే రేపు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కాని సినిమాపై పలు సంఘాలు కోర్టుకు వెళ్లాయి. కోర్టు విచారణలో ఉన్న ఈ సినిమా విడుదలపై మొదటి నుండే అనుమానాలు ఉన్నాయి. అయినా కూడా వర్మ సినిమా విడుదలపై చాలా పట్టుదలతో వ్యవహరించాడు. టైటిల్ వివాదాస్పదం అవ్వడంతో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ మార్చాడు. అయినా కూడా విడుదల సాధ్యం కాలేదు.

హైకోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. సెన్సార్ బోర్డు క్లీయరెన్స్ విషయంలో కొన్ని సమస్యలు ఉన్న కారణంగా ఇప్పటి వరకు సెన్సార్ పూర్తి చేసుకోలేదు. అలాగే సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ కొందరు ఫిర్యాదు చేశారు. వాటిపై కూడా విచారణ పూర్తి అయ్యే వరకు సినిమాను వాయిదా వేయాల్సిందిగా హైకోర్టు నిర్మాతలకు సూచించింది. దాంతో రేపు విడుదల అవ్వాల్సిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అలియాస్ కమ్మరాజ్యంలో కడప రెడ్లు విడుదల వాయిదా పడింది.

రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రంలో ఏపీ రాజకీయాలను ప్రధానంగా టార్గెట్ చేసి తీసినట్లుగా తెలుస్తోంది. ఏపీ ముఖ్య రాజకీయ నాయకులకు సంబంధించిన పలు సీన్స్ వివాదాస్పదం అవుతున్నాయి. ముఖ్యంగా పప్పు అంటూ వర్మ చేస్తున్న హడావుడి కారణంగా తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక మరో వైపు జనసైనికులు కూడా ఈ సినిమాపై కోపంగానే ఉన్నారు.
Please Read Disclaimer