సాహో: 100 సెకన్ల టీజర్ అల్లాడిస్తుంది!

0

ప్రభాస్ ఫ్యాన్స్ కి అన్ లిమిటెడ్ ట్రీట్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. గురువారం(నేటి) ఉదయం 11.23 నిమిషాలకు టీజర్ ముహూర్తం ఫిక్స్ చేశామని ప్రభాస్.. యువి క్రియేషన్స్ సంస్థ అధికారికంగా ప్రకటించగానే అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ. ట్రీట్ కి ఇంకో గంట సమయమే మిగిలి ఉంది. అయితే సాహో టీజర్ ఎలా ఉండబోతోంది. ఈ టీజర్ ని ఇప్పటికే చూసిన వాళ్లు ఏమంటున్నారు? అంటే ఇదిగో ఇదీ సంగతి.

ఇండియా మోస్ట్ అవైటెడ్ 2019 మూవీగా ఇప్పటికే సాహోపై భారీ అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే సినిమా ఆద్యంతం యాక్షన్ ప్యాక్డ్ కంటెంట్ తో అదరగొట్టేయనుందని తెలుస్తోంది. ఇప్పటికే ముంబైలో టీజర్ చూసిన వాళ్లు చెబుతున్న దాని ప్రకారం.. ఈ చిత్రంలో ప్రభాస్ లోని మ్యాచోయిజం(యాక్షన్ హీరోయిజం) పీక్స్ లో ఉంటుందట. టీజర్ లో కథను రివీల్ చేసే కంటే ప్రభాస్ లోని యాక్షన్ కోణాన్ని ఎలివేట్ చేసేందుకు ప్రాధాన్యతనిచ్చారు. అలాగే ప్రభాస్ పాత్రను ఒక సూపర్ హీరో తరహాలో డిజైన్ చేశారని చెబుతున్నారు. అలాగే ఈ పాత్రలో కామిక్ యాంగిల్ అదరగొడుతుందట. ప్రభాస్ లుక్ .. స్టైల్ .. కాస్ట్యూమ్స్ ప్రతిదీ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తాయి. 1.40 నిమిషాల (100 సెకన్లు) టీజర్ అల్లాడించడం గ్యారెంటీ. ఈ టీజర్ ఆద్యంతం భారీ యాక్షన్ .. ఛేజ్ లు కట్టి పడేస్తాయి. ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ సమకూర్చిన పోరాట దృశ్యాలు అబ్బురపరచనున్నాయని టీజర్ చూసిన వారు చెబుతున్నారు. ఈ సినిమాకి కెన్నీ బేట్స్ తో కలిసి ఏకంగా కొందరు స్టంట్ కొరియోగ్రాఫర్ల బృందం పని చేశారు. ఆ పనితనం తెరపై కనిపించనుంది. ఇది కేవలం ఏదో ఒక ప్రాంతానికే చెందే సినిమా కాదు. యూనివర్శల్ ఆడియెన్ ని దృష్టిలో ఉంచుకుని తీసిన సినిమా అని టీజర్ చూడగానే అర్థం అవుతుంది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ ని హాలీవుడ్ స్టాండార్డ్స్ లో ఎలివేట్ చేశారని తెలుస్తోంది.

సాహోలో .. ఇంటర్నేషనల్ లెవల్ యాక్షన్ సీన్స్ అబ్బో అనిపిస్తాయట. ఇక ఈ టీజర్ చూడగానే సుజీత్ లోని విజన్ ఆడియెన్ కి అర్థమవుతుంది. ఓవర్ ద టాప్ (ఓటీటీ) యాక్షన్ థ్రిల్లర్ ఇదని అంగీకరించి తీరతారు. గ్రిప్పింగ్ .. స్టన్నింగ్ .. మైండ్ బ్లోయింగ్.. మిరాకిల్.. ఈ టీజర్ ని వర్ణించేందుకు మాటలు చాలవు. రివ్యూ రైటర్లకు పదాలు దొరకడమే కష్టం! అని చెబుతున్నారు. ఇక నేటి ఉదయం 11గంటలకు ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూలో మీడియాతో కిటకిటలాడనుంది. టీజర్ రిలీజైన సెకన్లలోనూ దీనిపై రివ్యూలు హోరెత్తబోతున్నాయ్. లెట్స్ వెయిట్ ఫర్ తుపాకి టీజర్ రివ్యూ..