బిగ్ బాస్ లో ఈ సైకో రచ్చ ఏందిరా బాబు?

0

బిగ్ బాస్ అంటేనే సంచలనం. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. ఎంత గొడవ జరిగితే అంత మంచిదన్నట్లుగా.. ఎంత రచ్చ జరిగితే అంత హ్యాపీ అన్నట్లు ఉంటుంది. ఎందుకంటే.. గొడవ జరుగుతుంటే.. కుతూహాలానికి మించిన ఆసక్తి వ్యక్తమై.. పనులు ఆపేసుకొని మరీ చూడటం అలవాటే. సరిగ్గా ఈ అంశాన్ని ఆదారంగా చేసుకునే బిగ్ బాస్ షోను డిజైన్ చేశారని చెప్పాలి.

మిగిలిన భాషల్లో టెలికాస్ట్ అయ్యే బిగ్ బాస్ షోలతో పోలిస్తే.. తెలుగు వెర్షన్ కాస్త పద్దతిగా.. పొందిగ్గా.. మర్యాద మిస్ కాకుంటే.. అశ్లీలం లేకుండా సాగుతుందన్న పేరు ఉంది. అలా కుటుంబ కథాచిత్రంలా ఉంటే ఏం బాగుంటుంది? బాగ్ బాస్ కు ఏం నచ్చుతుంది. అందుకేనేమో.. ఈసారి ఈ షో ప్రారంభానికి ముందు నుంచే రచ్చ మొదలైంది. దీనికి తగ్గట్లే.. షో సాగుతున్న కొద్దీ ఊహించని రీతిలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

హౌస్ లోని ఒక కంటెస్టెంట్ మరో కంటెస్టెంట్ కొట్టుకునే వరకూ వెళ్లటం.. నీవు మగాడివిరా? అంటూ దరిద్రపుగొట్టు మాటలు అనేయటం.. అలా అంటే వాటిని కట్ చేయకుండా ప్లే చేయటం.. వగైరా వగైరాలెన్నో ఈ సీజన్ లో కనిపిస్తున్నాయి.

ఇప్పటికి ప్రసారమైనవి ఏం సరిపోతాయి? అనుకున్నారో ఏమో కానీ.. తాజాగా అదిరే రచ్చకు సంబంధించిన ప్రోమో ను వదిలారు. ఈ రోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో రచ్చమామూలుగా ఉండదన్న విషయం అర్థమయ్యే సీన్ ను అదే పనిగా ప్రసారం చేస్తూ.. ఇంత భారీ గొడవ ఎందుకు జరిగింది. ఏ కారణంగా జరిగిందన్న ఉత్సుకత పెరిగేలా.. ఎవరికి వారు.. ఇలా జరిగిందట అని మాట్లాడుకునేలాంటి ప్రోమో ను కట్ చేసి జనం మీదకు వదిలారు.

ఇంతకీ ఈ రోజు జరిగే రచ్చను సింఫుల్ గా చెప్పాలంటే.. కంటెస్టెంట్లలో ఒకరైన హిమజకు కోపం పీక్స్ కు వెళుతుంది. దీనికి కారణం ఆమె అమ్లెట్ తినే సమయంలో బాబా భాస్కర్ తో పాటు కొందరు ఇంటి సభ్యులు ఆమెపై కామెంట్స్ చేస్తారు. అంతే..పట్టరాని కోపంతో చేతిలో ఉన్న అమ్లెట్ ప్లేట్ ను ఎత్తి కొడుతుంది. అంతటితో ఆగితే.. ఏం బాగుంటుంది చెప్పండి. తన కోపం ఎంతన్నది అందరికి అర్థమయ్యేలా కిచన్ లోకి వెళ్లి గుడ్లలన్నింటిని పగలకొడుతుంది. ఎగ్ ట్రేను అమాంతం ఎత్తి నేలకేసి కొడుతుంది. తనను తినకుండా చేసినందుకు ఇంట్లో కూడా ఎవరూ తినకూడదని గట్టిగా అరిచేస్తుంది.

షాకింగ్ గా ఉన్న ఈ సైకిక్ చర్య ఎందుకు? హిమజకు నిజంగానే కోపం వచ్చిందా? నిత్యం పుల్లలు పెట్టటం ద్వారా షోను మరింత ఆసక్తికరంగా మార్చే బిగ్ బాస్ ఏదైనా సీక్రెట్ టాస్క్ ఇస్తే.. హిమజ అలా చేసిందా? లాంటి ప్రశ్నల మధ్య ఈ రోజు రాత్రి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ కూడా వెయిట్ చేయాలి. నిజానికి ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో.. ఉన్న సమస్యలు చాలాక.. ఈ తరహా సైకో చర్యల్ని చూసేందుకు గంటల కొద్దీ టైం కేటాయించుకోవాల్సిన అవసరం ఉందంటారా?
Please Read Disclaimer