హిమజ ఎమోషనల్ వీడియో.. ఇంటిని కూల్చేస్తున్నారు

0

నాలుగు రోజులు ఎవరితోనైనా కలిసి ఉంటే.. బోలెడన్ని గురుతులు ఉండిపోతాయి. అలాంటిది ఒక నెల రోజులు ఒక చోట ఉంటే.. ఆ ప్లేస్ తో ఉండే రిలేషన్ అంతా ఇంతా కాదు. మరి.. తామున్న ప్లేస్ రానున్న రోజుల్లో కనిపించకుండా పోతుందంటే.. బాధ కలగటం ఖాయం. ఇప్పుడు అలాంటి ఫీలింగ్ లోనే ఉంది బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజ.

దాదాపుగా మూడు నెలల పాటు ఒకే ఇంట్లో ఉండి.. ఎన్నో గురుతులు.. మరెన్నో సంగతులు మూటగట్టుకున్న ఇల్లు ఇక కనిపించకుండా పోతుందంటే ఆ బాధ కాస్త ఎక్కువే. తాజాగా అలాంటి బాధనే ఎదుర్కొంటున్న హిమజ తన ఇన్ స్టా అకౌంట్లో ఒక వీడియోను పోస్టు చేశారు.

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో నిర్మించిన బిగ్ బాస్ ఇంటిని కూల్చేస్తున్నారు. సీజన్ పూర్తి అయిన వెంటనే.. ఆ సెట్ ను తొలగించటం తెలిసిందే. తాజాగా జరుగుతున్నది అదే. అయితే.. మూడు నెలలకు పైగా తాను గడిపిన ఇంటిని తొలగిస్తున్న వేళ.. అందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది.

ఇంటి సెట్ ను బిగ్ బాస్ యాజమాన్యం కూల్చేస్తున్న వేళ.. అందులో ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్లు తెగ ఫీల్ అవుతున్నారు. మిగిలిన వారి సంగతిని పక్కన పెడితే.. హిమజ మాత్రం కాస్త ఎక్కువ భావోద్వేగానికి గురి అవుతోంది. గుర్తుకు వస్తున్నాయంటూ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ మూవీలోని పాటతో కూడిన బిగ్ బాస్ హౌస్ ను తొలగిస్తున్న పొట్టి వీడియోను షేర్ చేసింది.

ఈ ఇంటిని పడగొడుతున్నారు కానీ దానితో ఉన్న జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికి పదిలంగానే ఉంటాయన్న కామెంట్ ను పోస్టు చేసింది. బిగ్ బాస్ సీజన్ పూర్తి కావటమే కానీ.. ఎప్పుడూ కూడా అందులో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్ ఇలాంటి వీడియోను షేర్ చేసింది లేదు. హిమజ పోస్టు చేసిన వీడియో వైరల్ గా మారటమే కాదు.. చూసినోళ్లందరిని ఎమోషనల్ చేసేస్తోంది.

 

View this post on
Instagram

 

OUR
BIGBOSS HOUSE DEMOLISHED
Please Read Disclaimer