సీక్రెట్ టాస్క్… హౌస్ లో హిమజ రచ్చ రచ్చ

0

బిగ్ బాస్ శుక్రవారం ఎపిసోడ్ లో హిమజ మిగతా ఇంటి సభ్యులకు విలన్ గా మారాలి. ఇదే బిగ్ బాస్ హిమజకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్. ఈ టాస్క్ విజయవంతంగా పూర్తి చేస్తే హిమజకి ఇమ్యూనిటీ లభించి నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ లో ఉండదు. ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ హిమజ అమలు చేసే పనిలో భాగంగా హౌస్ లో నానా రచ్చ చేసింది. మొదట ఆమ్లెట్ తింటున్న హిమజని బాబా భాస్కర్ సరదాగా ఏదో అన్నారు. దీంతో సీరియస్ అయిపోయినట్లు నటించి ఆమ్లెట్ ప్లేట్ ని నేలకేసి కొట్టింది.

ఆ తర్వాత నేను తినకపోతే ఇంకా ఎవరు తినకూడదని మిగతా ఎగ్స్ బద్దలుగొట్టేసింది. దీంతో ఇంటి సభ్యులు ఆమెపై ఫైర్ అయ్యారు. నిన్ను అన్నవారి ఫుడ్ మీద నీ ప్రతాపం చూపించాలి గానీ… మిగతా వారి ఫుడ్ మీద కాదని రవి- అషు- జ్యోతిలు హిమజపై మండిపడ్డారు. అంతకముందు అలీ ప్రోటీన్ డబ్బాలని కొట్టేసింది. దీని గురించి హిమజని ప్రశ్నించిన అలీతో గొడవపడింది.

అలాగే అలీ షూస్- వితిక మేకప్ కిట్స్ దాచేసింది. చివరికి లగ్జరీ బడ్జెట్ ఇంటి సభ్యులకు రాకుండా చేయాలని హిమజ నానా రచ్చ చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే అలీ- రవిలు హిమజకి సీక్రెట్ టాస్క్ లో భాగంగా ఇలా చేస్తుందని అర్ధం చేసుకుని ఆమెని అడ్డుకున్నారు. దీంతో ఇంటి సభ్యులు విజయవంతంగా లగ్జరీ బడ్జెట్ ని పూర్తి చేశారు.

చివరికి హిమజకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ను సరిగా చేయలేకపోవడం వల్ల ఆమెకు ఇచ్చిన ఇమ్యునిటీని కోల్పోయిందని బిగ్ బాస్ ప్రకటించడంతో అలీ- శ్రీముఖి – రవిలు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే మిగతా సభ్యులు సీక్రెట్ టాస్క్ లో భాగంగా హిమజ ఇలా చేసిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. దీని తర్వాత రాహుల్ సిప్లిగంజ్ బర్త్ డే కావడంతో కేక్ కట్ చేసి హౌస్ లో సెలబ్రేట్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ తర్వాత అర్ధరాత్రి సమయంలో బాబా భాస్కర్- శివజ్యోతి- రాహుల్- అషులు వాటర్ తో ఆడుకుంటూ సందడి చేశారు.
Please Read Disclaimer