బిగ్ బాస్..హిమజకు హౌస్ మేట్స్ అంటే ఇంత పగ ఉందా..?

0

ప్రస్తుతం బిగ్ బాస్ మూడవ సీజన్ మరింత రసవత్తరంగా కొనసాగుతుంది.అయితే షో ఇంకెలాగో చివరికి వస్తుండడంతో హౌస్ మేట్స్ కూడా ఒక్కక్కరుగా ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తున్నారు.అసలు ఎప్పుడో ఎలిమినేట్ అయ్యిపోతుందనుకున్న హిమజ ఇటీవలే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది.అలా రావడంతోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ కోసం సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

ఇదిలా ఉండగా ఈ షోను ప్రసారం చేసే స్టార్ మా లోనే వచ్చే మరో గేమ్ షో “ఎఫ్ 3″కు హిమజ గెస్ట్ గా రాగా ఆ షో వ్యాఖ్యాత సుమ బిగ్ ఇంటి సభ్యులను ఉద్దేశించి కొంత మంది పేర్లు చెప్పినపుడు అక్కడ కొన్ని బొమ్మలపై తన రియాక్షన్ ఏమిటో చూపించమన్నారు.వరుణ్,హేమల పేర్లు చెప్పనపుడు బాగానే ఉంది కానీ పునర్నవి మరియు వితికల పేర్లు చెప్పినపుడు అయితే ఆమె ఫ్రస్ట్రేషన్ చూడాలి.

నిజంగానే వాళ్లంటే అంత పగ ఉందా అన్న రేంజ్ లో ఆ బొమ్మలను చూసి ఒక రేంజ్ లో కొట్టింది.ఇక ఫైనల్ గా శ్రీముఖి పేరును రవి చెప్పేసరికి డ్రెస్ సర్ది మరీ కొట్టేందుకు సిద్ధం అయ్యింది.అయితే ఇదంతా ఫన్ జానర్ లో చిత్రీకరించినా నిజంగా ఆ రేంజ్ ఫ్రస్ట్రేషన్ ఉందా అనిపించేలా ఈ ప్రోమో ఉంది.
Please Read Disclaimer