సైరా ని పక్కన పెట్టిన హిందీ జనాలు…!

0

బుధవారం విడుదలైన భారీ చిత్రం సైరా అన్ని ఏరియాలలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఉత్తరాదిన మాత్రం ఈ సినిమాకు వస్తున్న వసూళ్లు చూసి అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ అయోమయంలో పడిపోయారు. అక్కడ ఈ సినిమాకి సాహో సినిమాకంటే మంచి రివ్యూలు కూడా వచ్చాయి. అయినా అక్కడ వార్ సినిమాతో పోటీగా రిలీజ్ చేయడంతో సైరా కి నామమాత్రపు కలెక్షన్స్ కూడా రావట్లేదు. బాహుబలి రేంజ్ లో ఈ సినిమా తీసినా హిందీ ఆడియన్స్ ఎందుకు పక్కన పెట్టారో తెలియట్లేదని అనుకుంటున్నారు.

ఈ సినిమా హిందీ వెర్షన్ లో మొదటిరోజు కేవలం 2.5 కోట్లు నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది. రెండవ రోజు అయితే ఈ కలెక్షన్స్ కోటి రూపాయల లోపే ఉన్నాయి. అయితే ఈ రోజు రేపు వీకెండ్ కావడంతో ఈ రెండు రోజుల కలెక్షన్స్ మీద సినిమా యూనిట్ చాలా ఆశలు పెట్టుకుంది. అమితాబ్ తమన్నా లాంటి బాలీవుడ్ జనానికి పరిచయం ఉన్న ఆర్టిస్టులు ఈ సినిమాలో ఉన్నా అక్కడి జనం మాత్రం ఈ సినిమాని పట్టించుకోవట్లేదు. ఏదేమైనా హిందీ వెర్షన్ లో సైరా భారీ డిజాస్టర్ గా నిలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.