నయన్ పై హిందువులు నిప్పులు.. కారణం?

0

నయనతారను తమిళులు తలైవి అని అభిమానంగా పిలుచుకుంటారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ని తలైవా అని గౌరవించినట్టే నయన్ ని సమానంగానే గౌరవిస్తున్నారు. నయన్ ఇప్పటివరకూ తెరపై చేయని వెరైటీ లేనేలేదు. రకరకాల పాత్రలు పోషించింది. గ్లామరస్ పాత్రల్లో భాగంగా అవసరం మేర బికీనిలు టూపీస్ లు ధరించింది. ఒళ్లంతా చీరకట్టుతో ట్రెడిషనల్ సన్నివేశాల్లో కనిపించింది. రొమాన్స్ లో రసరమ్యను తలపించింది. శ్రీరామరాజ్యంలో సీత పాత్రలో ఒదిగిపోయి మెప్పించింది.

అంతేనా ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సంచలనాలు సృష్టించింది. తమిళనాట 100కోట్ల క్లబ్ నాయికగా వెలిగిపోతోంది. హారర్ నేపథ్యం సినిమాల్లోనూ నిరూపించుకుంది. మునుముందు దెయ్యం పాత్రల్లోనూ భయపెట్టాలని చూస్తోంది. మరి ఇవన్నీ చేసి చేసి బోర్ కొట్టిందో ఏమో గానీ! ఈసారి ప్రేక్షకులకు తెరపై సరికొత్త నయన్ ని పరిచయం చేయబోతోందట. తదుపరి అమ్మోరు పాత్రలో కనిపించనుందిట. సినిమా ఆద్యంతం రక్తి కట్టించేలా నయన్ రోల్ ఉంటుందని కోలీవుడ్ సమాచారం. ఉగ్ర రూపం దాల్చే అమ్మోరుగా.. దడ పుట్టిస్తుందట. ప్రస్తుతం నయనతార తమిళ్ లో ‘మూకుత్తి అమ్మన్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఆర్ జే బాలాజీ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. ఇది భక్తి నేపథ్యంలో వస్తున్న సినిమా. ఇటీవల దెయ్యాలు సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. వాటికి భిన్నంగా ఉండాలనే నయనతారను చూపిస్తున్నారట.

మరో ఆసక్తికర విషయం ఏమంటే.. అమ్మోరు పాత్రలో ఒదగాలంటే అందుకు తగ్గ జాగ్రత్తలు అవసరం. అందుకే నయనతార దీక్షలో ఉంటూ నటిస్తోందని ఆర్.జే.బాలాజీ తెలిపాడు. ప్రస్తుతం నయనతార కేవలం శాఖాహారం మాత్రమే తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో నయన్ పై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముకుత్తి అమ్మన్ అంటే కన్యాకుమారిలోని భవాని అమ్మవారి పేరు. నయనతార క్రిస్టియన్ కావడంతో అమ్మవారి పాత్రలు ఎలా పోషిస్తుంది అంటూ విమర్శల పర్వం తమిళనాడులో వేడెక్కిస్తోంది.