ప్లేబాయ్ ని కాదు.. నేను లవర్ బాయ్ ని!

0

‘RX 100’ తో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ తన సెకండ్ ఫిలిం ‘హిప్పి’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దిగంగనా సుర్యవంశి జజ్బా సింగ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా సూర్య సినిమా ‘నువ్వు నేను ప్రేమ’ ఫేమ్ T.N. కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ‘హిప్పి’ టీజర్ కాసేపటి క్రితమే విడుదల అయింది.

సిక్స్ ప్యాక్ ఫిజిక్.. టాటూలతో.. లాంగ్ హెయిర్ తో అసలు సిసలు కాసనోవా అవతారంలో ఉన్నాడు కార్తికేయ. టీజర్ లో మొదటి సీన్ లోనే కార్తికేయ ప్లేబాయ్ నేచర్ గురించి కమెడియన్ వెన్నెల కిషోర్ వివరించేస్తాడు. ‘ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో అమ్మాయితో తిరుగుతున్నావు.. నిన్నేమంటారో తెలుసా’ అంటాడు. మళ్ళీ ఈ ప్రశ్నకు టీజర్ ఎండింగ్ లో కార్తికేయ అమ్మాయితో చెప్పే డైలాగ్ లో ఆన్సర్ చెప్పించాడు దర్శకుడు. ఆ అమ్మాయితో కార్తికేయ ‘నువ్వు నన్ను ప్లేబాయ్ లా చూస్తున్నావు.. కానీ నేను లవర్ బాయ్ ని’ అంటాడు. ఇక ఈ జెనరేషన్ రౌడీ బాయ్ లాగా బార్లలో బీర్లు లాగించడం.. వీలైనప్పుడల్లా అమ్మాయిలతో లిప్ లాక్ లు లాగించడం అవలీలగా చేసేస్తున్నాడు. ‘నేను స్నేహకు కంపెనీ ఇచ్చాను. దాన్ని లవ్ అనుకుంటే ఎలా?’ అని కూడా తిరిగి ప్రశ్నిస్తున్నాడు.

టీజర్లో లిప్ లాకులు.. ఫైట్లు గట్రా అన్ని ఉన్నాయి కానీ అసలు ప్లాట్ ఏంటనేది మాత్రం రివీల్ చెయ్యలేదు. టీజర్లోని విజువల్స్ రిచ్ గా ఉన్నాయి.. మ్యూజిక్ యూత్ ఫుల్ గా ఉంది. ఓవరాల్ గా టీజర్ ట్రెండీగా ఉంది కానీ ఆడియన్స్ మెప్పించే.. థియేటర్లకు రప్పించే కంటెంట్ సినిమాలో ఉందా లేదా తెలియాలంటే ట్రైలర్ వచ్చే వరకూ వేచి చూడాలి. అంతలోపు ఈ ‘హిప్పి’ పై ఒక లుక్కేయండి. ముఖ్యంగా ఆ లాస్ట్ సీన్ లో స్విమ్మింగ్ పూల్ లో లాంగ్ లిప్ లాకును శ్రద్ధగా చూడండి బాబులు.. ఎంతో కళాత్మకంగా ఉంది!
Please Read Disclaimer