హిట్ టీజర్ టాక్

0

విశ్వక్ సేన్.. రుహాని శర్మ హీరో హీరోయిన్లుగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్’. న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంతి తిపిరినేని ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా టీజర్ కాసేపటి క్రితం విడుదలైంది. విశ్వక్ ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

టీజర్ ఆరంభంలో ఒక ఫ్లై ఓవర్ పై ఒక బైక్ ను పోలీస్ జీప్ చేజ్ చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ షాట్ లో ఓల్డ్ సిటీలో దొంగల వెనక మఫ్టీలో ఉన్న పోలీసులు పరిగెడుతూ ఉంటారు. సీన్ కట్ చేస్తే విశ్వక్ ఒక హాస్పిటల్ బెడ్ పై పడుకుని ఉంటాడు. “దిస్ జాబ్ విల్ డిస్ట్రాయ్ యూ విక్రమ్. యూ నీడ్ టు క్విట్ ది డిపార్ట్మెంట్”(ఈ పని నిన్ను నాశనం చేస్తుంది విక్రమ్. నువ్వు ఈ డిపార్ట్మెంట్ ను వదిలెయ్యాలి) అంటూ ఒక మహిళ విశ్వక్ పాత్రతో చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో ఎన్కౌంటర్ లొకేషన్ లా కనిపించే క్రైమ్ సీన్ కు విశ్వక్ నడుచుకుంటూ వెళ్తాడు. “డిపార్టుమెంటును మాత్రం నేను వదలలేను” అంటూ పోలీస్ ఉద్యోగం తనకు ఎంత ముఖ్యమో చెప్తాడు. “సర్ నాకు ఈ మిస్సింగ్ పర్సన్స్ కేసు అసైన్ చెయ్యండి సార్” అంటూ తన పై అధికారిని కోరతాడు.

సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన విశ్వక్ ఒక సంక్లిష్టమైన కేసు బాధ్యతను ఎందుకు తీసుకున్నాడు.. దాన్ని ఎలా పరిష్కరిస్తాడు.. ఆ కేసును ఛేదించే క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కుంటాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్ లాగా అనిపిస్తోంది. ఇంత సింపుల్ గా టీజర్ లేదు.. గజిబిజిగా ఉంది. ఇంగ్లీష్ సినిమాలు రెగ్యులర్ గా చూసేవారికి అర్థం అవుతుందేమో కానీ సాధారణ ప్రేక్షకులకు అర్థం కావడం కష్టమే. టీజర్ లో కొత్తదనం కూడా ఏమీ కనిపించడం లేదు. జస్ట్ ఒక రొటీన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా ఉంది. అవేవీ పట్టించుకోకుండా టీజర్ చూసేయండి.
Please Read Disclaimer