భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

టాప్ స్టోరి: కొత్త కలర్ ని అద్దిన హోలీ సాంగ్స్

0

హోలీ.. అన్ని మతాలను ఏకం చేసే పండుగ. కులమతాలు వర్గ వైషమ్యాలకు అతీతమైన పండుగ ఇది. చిన్నా- పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఇదో ప్రత్యేకమైన పండగ. హోలీ అంటే ఓ ఉత్సాహం.. ఆనందం.. ఉత్తేజం. వయసు పరవళ్లకు రంగులు తోడైతే ఆ జోరు ఆపతరమా! ఆ ఉద్వేగంలో లోకమంతా కలర్ ఫుల్ గా ఉంటుంది. సామాన్య జనం జరుపుకునే హోలీనే అంత బాగా ఉంటే.. అదే సినీ తారలు హోలీ జరుపుకుంటే.. హోలీలో హుషారుగా చిందులేస్తే.. దానికి హోలీ పాట తోడై తే ఎంత బాగుంటుందో కదా!. తెరపై అలాంటి కలర్ ఫుల్ దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. మరి సినిమాల్లో పాపులర్ అయిన హోలీ పాటలు కొన్ని చూద్దాం.

బాలీవుడ్ లో హోలీ పాటలకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే ఎక్కువగా పాపులర్ హోలీ పాటలు హిందీ సినిమాల్లో వచ్చాయి. ఇప్పటికీ అవి ఆయా పండగల్లో రీప్లే అవుతూ సంబరాన్ని రెట్టింపు చేస్తున్నాయి. అమితాబ్ నటించిన `సిల్ సిలా` చిత్రంలో `రంగ్ బర్సే` పాట 1981లో ఓ ఊపు ఊపింది. పాటకు అమితాబ్- రేఖా- జయా బచ్చన్- సంజీవ్ కపూర్ ల డాన్సులు తోడవ్వడం తో ఆ పాట జనంలోకి బాగా వెళ్ళి విశేషంగా అలరించింది. దీంతోపాటు అమితాబ్ మరో సినిమా `బఘ్బన్` లోని ‘హోలీ ఖేలే రఘువీరా’ పాట అక్షయ్ కుమార్- ప్రియాంక చోప్రా నటించిన `వక్త్`లో `దో మే ఏ ఫేవర్` .. `రామ్లీలా’లో రణ్వీర్ సింగ్- దీపికా పడుకొనెల మధ్య వచ్చే ‘లహు ము లగ్ గయా’ అనే హోలీ పాట… `జాలీ ఎల్ఎల్ బీ2’లో అక్షయ్ కుమార్.. హ్యూమా ఖురేషీల మధ్య వచ్చే ‘గో పాగల్’ అనే పాట…. `యే జవానీ హై దీవానీ`లో రణ్బీర్ కపూర్- దీపికాల మధ్య వచ్చే ‘బలమ్ పిచ్కరి’ అనే హోలీ సాంగ్…. `యాక్షన్ రీప్లే`లో ఐశ్వర్యరాయ్ పై వచ్చే ‘చన్ కె మోహల్లా’ అనే హోలీ సాంగ్…. ‘నవరంగ్’ చిత్రంలో ‘అరే జా రే హత్ నాట్ఖాత్’ అనే హోలీ పాట.. వరుణ్ ధావన్- అలియా భట్ల మధ్య `బద్రినాథ్ కి దుల్హనియా` చిత్రంలో టైటిల్ సాంగ్ తోపాటు అనేక ఇతర సినిమాల్లో హోలీ పాటలు వచ్చి బాలీవుడ్ లో సందడి చేశాయి. విశేషంగా ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి. తారల అద్భుత డాన్సులతో.. ఉత్సాహాన్నిచ్చే సింగర్స్ పాటలతో ఆద్యంతం కలర్ ఫుల్ గా సాగే ఈ పాటలు ఇప్పటికీ జనాలను అలరిస్తున్నాయి.

తెలుగులోనూ హోలీ పాటలు మంచి ఆదరణ పొందాయి. బాగా పాపులర్ అయ్యాయి. వాటిలో కమల్ హాసన్ నటించిన `నాయకుడు`లో ‘సందే పొద్దు మేఘమ్’ అనే పాట అప్పట్లో బాగా పాపులరైంది. ప్రభాస్ నటించిన `చక్రం` సినిమాలో ‘రంగేలి హోలీస.. పవన్ కళ్యాణ్ `ఖుషీ`లో ‘హోలీ హోలీ ల రంగ హోలీ.. చమ్మకేళిల హోలీస….. ఎన్టీఆర్ నటించిన `రాఖీ` చిత్రంలోని ‘రంగు రబ్బ రబ్బస… వెంకటేష్ నటించిన `జెమినీ`లో ‘దిల్ దివానాస.. నాగార్జున హరికృష్ణ నటించి న `సీతారామరాజు`లో ‘ఎకసేగతాత్తా’ వంటి పాటలు విశేషంగా
ఆకట్టుకోవడంతోపాటు ఇప్పటికీ హోలీ పండుగ సమయాల్లో పల్లెల్లో మార్మోగుతూనే ఉన్నాయి. హోలీ పండగకి సరికొత్త ఊపుని తెస్తున్నాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-