‘విరాటపర్వం’ కోసం హాలీవుడ్ నుండి..!

0

రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విరాటపర్వం’. ఈ చిత్రం చాలా నెలల క్రితమే ప్రారంభం అయినా కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. సాయి పల్లవికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక రానాకు సంబంధించిన పార్ట్ మరియు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందట. నక్సల్స్ ఉద్యమం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని అందుకే ఎక్కువగా సినిమా అడవుల్లో సాగుతుందని సమాచారం అందుతోంది.

అడవుల్లో అడ్వెంచర్ యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్ గా వచ్చే విధంగా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. అందుకోసం హాలీవుడ్ ప్రముఖ యాక్షన్ కొరియోగ్రఫర్ స్టేఫాన్ రిచర్ ను రంగంలోకి దించబోతున్నారట. గతంలో ఈయన కొన్ని బాలీవుడ్ సినిమాలతో పాటు తమిళంలో భారీ ఎత్తున తెరకెక్కి సక్సెస్ అయిన బిల్లా 2 కు కూడా స్టంట్స్ అందించాడు. విభిన్నమైన యాక్షన్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకులకు రియల్ ఫీలింగ్ కలిగించడంలో ఆయన సిద్దహస్తుడు.

అడవిలో ఉండే యాక్షన్ సీన్స్ ను సహజంగా తీర్చి దిద్దడంలో అతడు మాత్రమే కరెక్ట్ అనే ఉద్దేశ్యంతో కాస్త ఎక్కువ పారితోషికం అయినా ఆయన్ను రంగంలోకి దించాలనే నిర్ణయానికి చిత్ర యూనిట్ సభ్యులు వచ్చారు. ప్రస్తుతం రానా రెస్ట్ లో ఉన్నాడు. త్వరలోనే షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. మొదట కొన్ని సన్నివేశాల చిత్రీకరణ తర్వాత అప్పుడు యాక్షన్ సీన్స్ ను మొదలు పెట్టబోతున్నారట. అతి త్వరలోనే విరాటపర్వం చిత్రం షూటింగ్ పున: ప్రారంభం కాబోతుంది. వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Please Read Disclaimer