రెడ్ హాట్.. ఇన్ స్టా మిర్చి!

0

సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ కు ఇప్పుడు క్రేజ్ లేదు కానీ ఓ ఇరవై ఏళ్ల క్రితం అమీషా ఓ క్రేజీ హీరోయిన్. హృతిక్ రోషన్ డెబ్యూ ఫిలిం ‘కహో న ప్యార్ హై’ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమీషా తెలుగులో పవన్ కళ్యాణ్ ‘బద్రి’.. మహేష్ బాబు ‘నాని’ సినిమాల్లో కూడా నటించింది. మొదట్లో సినిమాలు ఓకే అనిపించినా తర్వాత వరసగా ఫ్లాపులు ఎదుర్కోవడంతో స్టార్ హీరోయిన్ గా మారలేకపోయింది.

ఇప్పుడు అమీష వయసు 43. అయినా ఫిట్నెస్.. గ్లామర్ మెయింటెయిన్ చేస్తూ హాట్ ఫోటోషూట్లు చేస్తూ ఈతరం భామలకు పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఈ జెనరేషన్ నెటిజన్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈమధ్య అమీషా తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు “రెడ్ హాట్ అండ్ రెడీ ఫర్ సాటర్ డే నైట్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. స్లీవ్ లెస్ రెడ్ కలర్ గౌన్ ధరించింది. థై స్లిట్ కూడా ఉండడంతో సూపర్ హాట్ గా ఉంది. మేకప్ తో పాటు రెడ్ కలర్ లిప్ స్టిక్ తో ఘాటుగా కనిపిస్తోంది. అమీషా మొదటి నుంచి హాట్ బ్యూటీనే కాబట్టి అందాలను వడ్డించింది.

ఈ ఫోటోలకు ఇన్స్టాగ్రామ్ లో మంచి స్పందనే దక్కింది. “ఇన్స్టాగ్రామ్ మిర్చి”.. “తూ చీజ్ బడీ మస్త్”.. “హాట్ రెడ్ రోజ్” అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. అమీషా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘దేశి మ్యాజిక్’.. ‘ది గ్రేట్ ఇండియన్ కాసినో’.. ‘తోబా తేరా జల్వా’ అనే సినిమాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-