బట్ట తల బ్యాచిలర్స్ పై హాట్ బ్యూటీ కామెంట్స్

0

ఒక సినిమా లో హీరో ఒకటి రెండు వెంట్రుకలు ఊడిపోవడం తోనే క్యాన్సర్ వచ్చినంతగా బాధపడుతూ జీవితం లో ఏదో కోల్పోయిన ఫీలింగ్ కు గురవుతాడు. అంత కాకున్నా చాలా మంది జుట్టు ఊడి పోతుందని తెగ బాధపడి పోతూ ఉంటారు. మూడు పదుల వయసు రాక ముందే చాలా మంది కి సగం కు పైగా జుట్టు ఊడి పోయి బట్టతల వచ్చేస్తుంది. అలాంటి వారి బాధలను.. వారి మనో భావాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన చిత్రం ‘బాలా’.

ఈ చిత్రం లో ఆయుష్మాన్ ఖరానా హీరో గా నటించగా భూమి పడ్నేకర్.. యామీ గౌతమ్ హీరోయిన్స్ గా నటించారు. సినిమా కు పాజిటివ్ టాక్ దక్కడం తో పాటు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. మొదటి వారం లోనే సినిమా బ్రేక్ ఈవెన్ కు దగ్గర అయినట్లుగా సమాచారం అందుతోంది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన యామీ గౌతమ్ ఒక ఇంటర్వ్యూలో బట్ట తల కుర్రాళ్ల గురించి మాట్లాడుతూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది.

బట్ట తల ఉన్న వ్యక్తి ని పెళ్లి చేసుకోవాల్సి వస్తే చేసుకుంటారా అంటూ ప్రశ్నించిన సమయం లో ఆమె తడుముకోకుండా అందులో ఏముంది.. తప్పకుండా చేసుకుంటాను అంటూ చెప్పేసింది. నిజం చెప్పాలంటే బట్టతల ఉన్న వారు చాలా శాంతంగా ఉంటారు. వారు ఎక్కువగా ఆలోచించడం తో పాటు మంచి వారుగా ఉంటారు. బట్టతల ఎక్కువ ఉన్నంత మాత్రాన వారిని చిన్న చూపు చూడ వద్దంటూ యామీ గౌతమ్ అభిప్రాయ పడింది.

బట్ట తల ఉన్నంత మాత్రాన వారిలో వారు బాధ పడవద్దని సూచించింది. వాళ్లని వాళ్లు మొదట ప్రేమించుకోవాలి. ఆ తర్వాత ఇతరులు వారిని ఖచ్చితంగా ప్రేమిస్తారు. ఇదే విషయాన్ని సినిమాలో చూపించినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ఆమెకు బట్ట తల బ్యాచిలర్స్ వారి ఫొటోలను ఈ అమ్మడితో షేర్ చేస్తున్నారట. నన్ను పెళ్లి చేసుకోమంటూ ఆమెను కోరుతున్నారట.
Please Read Disclaimer