జీక్యూ కోసం హాట్ క్యాట్

0

బాలీవుడ్ లో చాలామందే బ్యూటీలు ఉన్నారు కానీ అంతమందిలో కూడా తమ ప్రత్యేకత చాటడం కొందరికే సాధ్యమవుతుంది. అలా ఇప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన ఫాల్లోయింగ్ ఏర్పరుచుకున్న భామ కత్రినా కైఫ్. 15 ఇయర్స్ ఇండస్ట్రీ అయినా ఇప్పటికీ క్రేజీ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ న్యూ జెనరేషన్ భామలకు పోటీనిస్తోంది. సోషల్ మీడియాలో మంటలు పెట్టడంలో కియారా.. జాన్విలకు తానేమీ తీసిపోదని నిరూపిస్తోంది.

రీసెంట్ గా ఈ భామ జీక్యూ మ్యాగజిన్ కవర్ పేజిపై మెరిసింది. ఆ ఫోటోను తన ఇన్స్టా ఖతా ద్వారా పోస్ట్ చేసి ‘కే(Kay) బై కత్రినా. GQ ఇండియా మ్యాగజైన్ నవంబర్ 2019’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కత్రినా Kay బ్రాండ్ తో కాస్మెటిక్స్ వ్యాపారం చేస్తోంది. అందుకే ఆ బ్రాండ్ కు ప్రమోషన్ కల్పించుకుంటోంది. ఇక ఫోటో విషయానికి వస్తే వైట్ అండ్ బ్లాక్ డిజైన్ ఉన్న స్లీవ్ లెస్ టాప్ ధరించి తడిజుట్టుతో తమకం ఉన్న కళ్ళతో ఒక ఫసాక్ పోజిచ్చింది. జీక్యూ మ్యాగజైన్ నవంబర్ ఎడిషన్ లో ‘కత్రినా కైఫ్ మేకింగ్ వేవ్స్’ అనే టైటిల్ తో ఒక కథనం కూడా ప్రచురించారని కవర్ పేజిపై వెల్లడించారు.ఆ టైటిల్ ను రఫ్ గా ‘ప్రకంపనలు సృష్టిస్తున్న కత్రిన’ అని మనం అనువాదం చేసుకోవచ్చు. అలా కాకుండా డబ్బింగ్ సినిమాల తరహాలో ట్రూ ట్రాన్స్ లేషన్ అయితే “అలలు తయారు చేస్తున్న కత్రినా కైఫ్’ అని అందంగా చెప్పుకోవచ్చు.

ఈ ఫోటోకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మూడు గంటల్లోనే నాలుగు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ‘సింబల్ ఆఫ్ హాట్నెస్’.. ‘సెక్సీ కవర్ పేజ్’.. ‘బాలీవుడ్ ఏంజెల్’అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఇక కత్రినా సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ చిత్రం ‘సుర్యవంశి’ లో హీరోయిన్ గా నటిస్తోంది.
Please Read Disclaimer