యోగా భంగిమలతో కిర్రెక్కించేస్తోందిగా

0

45 ప్లస్ మలైకా అరోరా సినిమాల్లో కంటే పార్టీల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అదే సమయంలో మూడు పదులైనా నిండని అర్జున్ తో డేటింగ్ చేస్తూ యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. కుర్రహీరోతో షికార్ల వ్యవహారం తరచూ మీడియా కంటపడుతూ హైలైట్ అవ్వడం చూస్తున్నదే. ఒకప్పుడు హాట్ హీరోయిన్ గా .. ఐటెమ్ భామగా మెస్మరైజ్ చేసిన మలైకా ఇప్పుడు యోగా- ఫిట్నెస్ పేరుతో ప్రత్యేక ట్రీట్ ఇస్తోంది. తరచూ తాను చేసే యోగా వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఆమె పంచుకున్న యోగా వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

ఈ వీడియోలో మలైకా యోగా విన్యాసాలు మత్తెక్కిస్తున్నాయి. ఆద్యంతం సెక్సీగా ఉండే భంగిమల్లో మలైకా యోగాసనాలు కిర్రెక్కిస్తున్నాయంతే. వెరైటీ వెరైటీ అసనాలతో మత్తెక్కిస్తూనే అభిమానులకు పలు సూచనలు చేసింది. ఈ 15 నిమిషాల నిడివి గల వీడియో లో ఎలా యోగ చేయాలో.. అందులోని టిప్స్ ని తెలియజేసింది. నిత్యం యవ్వనంగా.. ఆరోగ్యంగా ఉండేందుకు తన టిప్స్ ఉపయోగపడతాయని వెల్లడించింది.

అయితే ఆమె చెప్పే టిప్స్ కంటే ఆమె భంగిమల్ని ఆస్వాధించే పనిలో నెటిజనులు ఫుల్ బిజీ. అందాల షో చేస్తూ సందేశం ఇస్తానంటే ఎవరైనా చూపు తిప్పుకుంటారా? మలైకా విషయంలో అదే జరుగుతోంది. మరి మలైకం ఇదంతా ఎందుకు చేస్తోంది? తన ఎయిమ్ ని రీచ్ అవుతుందా? అనేది చూడాలి. మలైకా అందాల విందారగించి.. తను చెప్పే టిప్స్ కూడా పాటించాలని నెటిజనులు నిరంతరం సోషల్ మీడియాని ఫాలో చేస్తున్న సంగతి తెలిసిందే. 2018లో `పటాఖా` చిత్రం లో ‘హలో హలో’ సాంగ్ లో మెరిసిన మలైకా ప్రస్తుతం సోనీ టీవీలో ప్రసారమయ్యే ‘ఇండియా బెస్ట్ డాన్స్ షో’కి జడ్జ్ గా వ్యవహరిస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-