ప్రభాస్ తో `ధూమ్ 4` ప్లాన్స్ ఎంతవరకూ..?

0

పాన్ ఇండియా స్టార్ గా డార్లింగ్ ప్రభాస్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. బాహుబలి ఫ్రాంఛైజీ.. సాహో చిత్రాలతో అతడి రేంజ్ స్కైని టచ్ చేసింది. ప్రస్తుతం జిల్ రాధాకృష్ణ సహా నాగ్ అశ్విన్ లతో పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తున్నాడు. యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథాంశాల్ని ఎంచుకుని తెలుగు ఆడియెన్ తో పాటు హిందీ ఇతర దక్షిణాది భాషల్లో మార్కెట్ ని కొల్లగొట్టే ప్లాన్ తో ఉన్నాడు. అయిదే దీనిని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లడమెలా? అంటే అతడు ఏదైనా ఒక బాలీవుడ్ సినిమాలో డైరెక్టుగా నటిస్తేనే సాధ్యమని అంతా భావిస్తున్నారు. ప్రభాస్ నటించే బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం రెబల్ అభిమానులు ఎంతో ఆసక్తిగానూ ఉన్నారు. అయితే ప్రభాస్ మాత్రం ఇప్పటివరకూ దేనికీ సంతకం చేయలేదు. అయితే కథా చర్చలు మాత్రం సాగిస్తున్నాడు. తనకి సరిపడే కథ దొరికితే అటు యశ్ రాజ్ ఫిలింస్ కి కానీ ధర్మ ప్రొడక్షన్స్ కి కానీ ఓకే చేసే వీలుందన్న ఊహాగానాలు చాలా కాలంగా సాగుతున్నాయి.

ప్రస్తుతం యష్ రాజ్ ఫిలింస్ ధూమ్ 4 ని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉంది. ఇందులో హృతిక్ రోషన్ ఓ కీలక పాత్ర పోషించనున్నాడు. అతడికి ధీటుగా కనిపించే మరో స్టార్ ని ఎంపిక చేసేందుకు ప్రయత్నాల్లో ఉంది. జాన్ అబ్రహాం.. అమీర్ ఖాన్ లాంటి స్టార్లు ఇప్పటికే నటించేశారు. ఆ క్రమంలోనే షారూక్.. సల్మాన్ లాంటి స్టార్లను సంప్రదించింది. కానీ ఆ ఇద్దరూ రకరకాల కారణాలతో ఆసక్తిని కనబరచలేదు. ఆ క్రమంలోనే బాహబలి స్టార్ ప్రభాస్ వైపు యశ్ రాజ్ ఫిలింస్ దృష్టి మరలిందని వార్తలొచ్చాయి. అంతేకాదు ప్రభాస్ తో చాలా కాలంగా చర్చలు జరుపుతున్నారు. కానీ ఇంకా ఏదీ ప్రభాస్ లాక్ చేయ లేదని తెలుస్తోంది.

2020 లో యశ్ రాజ్ సంస్థ 50 వ సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా భారీ ప్రకటన చేయాలని భావించినా ధూమ్ 4 కి కాస్టింగ్ ఎంపికలు పూర్తి కాకపోవడంతో వేచి చూస్తున్నారు. ఈలోగానే వైరస్ మహహ్మారీ విలయం అన్నిటికీ అడ్డంకులు సృష్టించింది. ఇక ఆదిత్య చోప్రా బృందం వేచి చూసే ఆలోచనతో లేదు. సాధ్యమైనంత తొందరగా ప్రభాస్ ని లాక్ చేయాలని చూస్తోందట. సీక్వెల్ నాలుగో భాగంలో హృతిక్ రోషన్ – ప్రభాస్ లను కలిసి తీసుకురావాలని వైఆర్ఎఫ్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు కు సంబంధించి ప్రభాస్ తో వైఆర్ఎఫ్ బృందం మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇది కార్యరూపం దాల్చినట్లయితే ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిలుస్తుందనడం లో సందేహం లేదు. ఒరిజినల్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ ఈ ప్రాజెక్టు కు దర్శకత్వం వహించనన్నారు. అయితే నాగ్ అశ్విన్ ప్రాజెక్టును బట్టి ప్రభాస్ కాల్షీట్లను కేటాయించాల్సి ఉంటుంది.
Please Read Disclaimer