సౌండ్ లేకుండా సైగల్ని ఎంజాయ్ చేయమన్న స్వీటీ

0

అవును .. స్వీటీ అనుష్క శెట్టి ఇకపై సౌండ్ ని పాస్ చేసి సైగల్ని ఎలా ఎంజాయ్ చేయాలో నేర్పిస్తానని అంటోంది. తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థ్రిల్లర్ `నిశ్శబ్ధం` అక్టోబర్ 2 న అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ మూవీ చూస్తే అందుకు ఆస్కారం లభిస్తుందని హింట్ ఇచ్చింది. టైటిల్ కి తగ్గట్టే ఈ చిత్రంలో అనుష్క సాక్షి అనే మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో ఆమె సంకేత (సంజ్ఞలు లేదా సైగలు) భాషలో కమ్యూనికేట్ చేయడం ఆకట్టుకుంది.

ఈ బుధవారం అంతర్జాతీయ సంకేత (సైన్.. సైగలు) భాషా దినోత్సవం సందర్భంగా అనుష్క ఇన్ స్టాగ్రామ్ లో తన అభిమానులకు ఒక ముఖ్యమైన సందేశాన్ని షేర్ చేసింది. “నిశ్శబ్దాన్ని శక్తివంతం చేయండి.. ధ్వనిని పాజ్ చేయండి.. సైలెన్స్ ని అభినందిస్తున్నాం“ అని అనుష్క పోస్ట్ చేసింది.

మాధవన్- అంజలి- సుబ్బరాజు- శాలిని పాండే- హాలీవుడ్ స్టార్ మైఖేల్ మాడ్సెన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కోన వెంకట్- టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. మ్యూట్ ని ఆస్వాధించేందుకు ఇంకో వారం ఆగితే చాలు!