సైరాకు హిందీలో రెస్పాన్స్ ఎలా ఉంది?

0

ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘సైరా’ ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు వెర్షన్ కు మంచి రెస్పాన్స్ ఉంది కానీ హిందీ వెర్షన్ కు అదేవిధమైన రెస్పాన్స్ లేదు. క్రిటిక్స్ విషయమే తీసుకుంటే. ఫిలిం కంపానియన్ అనుపమ చోప్రా.. సుచరిత త్యాగి ‘సైరా’ లో యాక్షన్ సీక్వెన్సులు అద్భుతంగా ఉన్నాయి కానీ డ్రామా కనెక్ట్ కాలేదని అభిప్రాయపడ్డారు. మిగతా క్రిటిక్స్ కూడా ఈ సినిమాను యావరేజ్ మూవీ అని తేల్చారు. బాలీవుడ్ లో రెగ్యులర్ గా ఫ్రీడం ఫైట్ మీద సినిమాలు వస్తుంటాయి కాబట్టి ఇందులో కొత్తదనం లేదని అభిప్రాయపడడంలో పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు.

మరో ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ సినిమాకు ఇంకా తన రివ్యూ ఇవ్వలేదు. మరోవైపు సాధారణ ప్రేక్షకుల రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో అయితే లేదు. ‘బాహుబలి’.. ‘సాహో’ సమయంలో హిందీ ప్రేక్షకులు పూనకం వచ్చినట్టుగా ఊగిపోయారు కానీ ‘సైరా’ కు అలాంటి క్రేజ్ కనిపించడం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద పోటీగా రిలీజ్ అయిన హృతిక్ రోషన్ – టైగర్ ష్రాఫ్ ల ‘వార్’ సినిమాకు కూడా స్పందన అంతంతమాత్రంగానే ఉంది. మొదటి రోజు రెస్పాన్స్ ను బట్టి చూస్తే ‘సైరా’ కు ‘సాహో’ స్థాయిలో కలెక్షన్స్ వచ్చేది అనుమానమేనని చెప్పకతప్పదు.

‘సైరా’ లో అమితాబ్ బచ్చన్ నటించడం వల్ల హిందీ వెర్షన్ కు ప్రయోజనం కలిగిందనే మాట మాత్రం వాస్తవం. అమితాబ్ లాంటి బాలీవుడ్ ఫేస్ కనుక లేకుండా ఉంటే ‘సైరా’ కు ఈ స్థాయి స్పందన అయినా దక్కి ఉండేదా అనేది కూడా అనుమానమే. ఇక ‘సైరా’ హిందీ వెర్షన్ మొదటి రోజు కలెక్షన్లను బట్టి మనం ఎలాంటి స్పందన దక్కిందని ఒక అంచనాకు రావచ్చు.