కేఎం వాసుదేవన్ నంబూద్రి లెజెండ్ ఆర్టిస్ట్ గా ఎలా మారారు

0

ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక ఆర్ట్ ఉంటుంది. ఒకరు చదువులో ఫస్ట్ అయితే మరొకరు ఆటల్లో ఫస్ట్. ఒకరికి ప్రభుత్వం అంటే ఇష్టం ..ఇంకొందరికి సాఫ్ట్ వేర్ అంటే ఇష్టం. ఎవరి ఇష్టం వారిది. చదువే ముఖ్యం అనుకుంటే సచ్చిన్ క్రికెట్ కి మాస్టర్ ఎదిగేవారు కాదు. అలాగే చదువుని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. చదువుతో పాటుగా తమకి ఇష్టమైన రంగాలపై అవగాహన పెంచుకుంటూ జీవితంలో ముందకు సాగితే ఎన్నో విజయాలు దరిచేరతాయి.

ఇకపోతే ఏదైనా తమకి ఇష్టం ఉన్న రంగంలో పూర్తిగా లీనమై పోరాడితే .. అందులో లెజెండ్ అనిపించుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరంలేదు. అలాంటివారు మన ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే ..లెజెండ్ ఆర్టిస్ట్ కేఎం వాసుదేవన్ నంబూద్రి. ఆయన చిత్రాలు మనుషుల మధ్య ఉంది అనుబంధాలను గుర్తుచేస్తాయి. మధ్యతరగతి కుటుంబాల జీవన విధానాన్ని కళ్లకు కడతాయి. నాటి తరం మొదలుకొని నేటి తరాల మధ్య ఉండే అంతరాలను తెలియజేస్తాయి. మనషుల జీవన విధానం కల్చర్ ఆచారాలు కళలు సినిమాలు సాహిత్యం ఏ జానర్ అయిన తన స్టయిల్ లో బొమ్మలు గీసి వాటికీ ప్రాణం పోయగలడు.

కేఎం వాసుదేవన్ నంబూద్రి పెయింటర్ స్కల్ప్చర్ లైన్ ఆర్టిస్ట్ ఆర్డ్ డైరెక్టర్. కేరళలోని సుకపురం టెంపుల్ ఆయనని ఆర్టిస్టుగా మార్చేసింది. ఆ టెంపుల్‌పై శిల్పాలు బొమ్మలు చిత్రకళ వైపు మళ్లించాయి. మద్రాస్ స్కూల్లో ఫైన్ ఆర్ట్స్ చేసిన ఆయన లైన్ స్కెచ్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ‘రేఖాచిత్రంగల్’ స్కెచెస్కు గాను ఆయనకు 2003లో రాజా రవి వర్మ అవార్డు కూడా అందుకున్నారు. కొన్ని సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. తన బొమ్మలతో మలయాళం సాహిత్య పుస్తకాలకు రూపం ఇచ్చాడు. చక్కని కార్టూన్ బొమ్మలు గీసి సాహిత్యాన్ని మరింత దగ్గర చేశాడు. చిత్రకళే జీవితంగా బతుకుతున్న ఆయన ఇంటికివెళ్తే.. తెల్లని గడ్డం కళ్లజోడు ధరించి కాన్వాస్‌పై బొమ్మలు గీస్తూ ఒక కామన్మెన్లా కనిపిస్తాడు. ఏదైనా ఒకే దానిపై దృష్టి పెట్టి ..ముందుకు పొతే సక్సెస్ అదే వస్తుంది అని చెప్పడానికి ఈయనే ఒక నిదర్శనం.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home