వెంకీమామ ఎన్నాళ్లు ఈ డైలమా?

0

విక్టరీ వెంకటేష్- నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న చిత్రం `వెంకీమామ`. బాబి దర్శకుడు. డి.సురేష్ బాబు- పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ తేదీపై రకరకాల డైలమా గురించి తెలిసిందే. వాస్తవానికి అక్టోబర్ లో రిలీజ్ చేయాలని భావించిన అనూహ్యంగా సంక్రాంతి రిలీజ్ అంటూ నిర్మాత డి.సురేష్ బాబు కొత్త పల్లవి అందుకున్నారు. వెంకీమామ బడ్జెట్ అంచనాల్ని మించింది. దాంతో భారీ ఓపెనింగులు రాబట్టాల్సిన సన్నివేశం నెలకొంది. మారిన వ్యూహంతో సంక్రాంతి సెలవుల్ని టార్గెట్ చేశారని ప్రచారమైంది.

అయితే ఆ తర్వాత కూడా ఆ ఆలోచన మార్చుకున్నారు. సంక్రాంతి బరిలో వార్ ఊహించిన దానికంటే ఠఫ్ గా ఉండడంతో క్రిస్మస్ బరిలో కానీ లేదా అంతకు రెండు వారాల ముందు కానీ రావాలని భావించారు. చివరికి డిసెంబర్ 13న విక్టరీ వెంకటేష్ బర్త్ డే కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారని ప్రచారమైంది. అయితే ఇప్పటికీ రిలీజ్ విషయంలో డైలమా కొనసాగుతోందట. ఇన్ని డైలమాల నడుమ మరోసారి డేట్ మారనుందని ప్రచారం సాగుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడిందట. డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 25 కి షిఫ్ట్ చేశారని ప్రచారమవుతోంది. క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నామని.. డిసెంబర్ 24న ప్రీమియర్లకు ఏర్పాట్లు చేసుకోవచ్చని అమెరికా పంపిణీదారులకు ఇన్ఫామ్ చేశారట. మొత్తానికి అగ్ర నిర్మాతలో రిలీజ్ డైలమా గురించి పరిశ్రమ వర్గాల్లో మరోసారి ఆసక్తికర చర్చ సాగుతోంది. క్రిస్మస్ సెలవుల్లో భారీ వసూళ్లే లక్ష్యంగా రిలీజ్ చేయాలని పంతం పడుతున్నారని తాజా సన్నివేశం చెబుతోంది. అయితే ఇప్పటివరకూ వెంకీమామ రిలీజ్ డైలమాపై సురేష్ ప్రొడక్షన్స్ సరైన క్లారిటీ ఇవ్వకపోవడం కన్ఫ్యూజన్ కి తావిస్తోంది.
Please Read Disclaimer