వెళ్లిపోతూ రోహిణి ఎవరికి ఎన్ని మార్కులు వేసిందంటే?

0

బిగ్ బాస్ షోను ఫాలో అవుతున్న వారంతా ఎవరు ఎలా వ్యవహరిస్తుంటారో అంచనా ఉంటుంది. అయితే.. దీనికి మించిన అంచనా ఇంట్లో ఉండే కంటెస్టెంట్లకు ఉంటుంది. 24 గంటల పాటు జరిగిన వ్యవహారాల్ని ఎడిట్ చేసి టెలికాస్ట్ చేయటం వల్ల కొన్ని అంశాల్నిప్రేక్షకులు మిస్ అవుతుంటారు. అదే సమయంలో.. ఇంట్లో ఎవరేం చేస్తున్నారో అన్న విషయాలు అందరికి తెలియవు. కాకుంటే.. తమ కళ్లకు కనిపించే అంశాల మీద వారికి ఉండే అంచనాను అంత తేలిగ్గా తీసేయలేం.

కెమేరా కంటికి అందని అంశాలు కూడా చాలానే ఉంటాయి. ఈ వారం ఎలిమినేట్ అయిన రోహిణి ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమెను.. నాగార్జున ఆసక్తికర టాస్క్ ఇచ్చారు. ఇంట్లో ఉన్న వారిలో ఎవరికి ఎన్ని మార్కులు వేస్తామని అడిగినప్పుడు ఆమె రియాక్ట్ అయిన తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

ఎలిమినేషన్ లోకి వచ్చిన తొలిసారే ఇంటి నుంచి బయటకు రావాల్సిన పరిస్థితికి రోహిణి తెగ ఫీల్ కావటాన్ని కాసేపు పక్కన పెడితే.. ఇంట్లో ఉన్న వారిలో ఆమె ఎవరికెన్ని మార్కులు వేసిందో చూసినప్పుడు.. బాబా భాస్కర్ కు నూటికి వెయ్యి మార్కులు వేయగా.. అలీకి వందకు వంద మార్కులు వేసింది. మహేశ్.. శ్రీముఖిలకు మాత్రం నూటికి యాభై మార్కులకే పరిమితం చేసింది. ఎందుకని అడిగితే.. హౌస్ లో ఉన్నప్పటికి ఆట గురించే శ్రీముఖి ఆలోచిస్తూ ఉంటుందని పేర్కొంది.

అందుకే తాను తక్కువ మార్కులు వేసినట్లు చెప్పింది. ఇక.. మహేశ్ గొడవలు పెంచటానికే చూస్తాడు తప్పించి తగ్గించటానికి చూడడని చెప్పింది. అషూకు 99 మార్కులు వేస్తే.. అందరిలోనూ సాఫ్ట్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రవికృష్ణకు మాత్రం 95 మార్కులే వేసింది. వెళుతూ.. వెళుతూ తన తోటి కంటెస్టెంట్ల మీద చేసిన వ్యాఖ్యల్లో నిజం ఎంతన్నది రానున్న రోజుల్లో మరింత క్లారిటీ రావటం ఖాయం.
Please Read Disclaimer