అసలు బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ చేతికొచ్చింది ఎంత?

0

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ముగిసి వారం రోజులు కావస్తున్నా కూడా ఇంకా ఆ షోకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అనూహ్యంగా రాహుల్ ట్రోఫీ విన్నర్ అవ్వడంతో ఆ చర్చ మరింత ఎక్కువ అయ్యింది. శ్రీముఖి విన్నర్ అయ్యి ఉంటే ఈ స్థాయిలో సోషల్ మీడియాలో సందడి ఉండేది కాదేమో. రాహుల్ ఒక సామాన్యమైన సెలబ్రెటీగా కొద్ది మందికి తెలిసిన వ్యక్తిగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి తెలుగు రాష్ట్రాల్లో యమ క్రేజ్ ఉన్న శ్రీముఖిపై విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఆ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ స్థాయి చర్చకు కారణం అయ్యింది. రాహుల్ పారితోషికం ఎంత.. రాహుల్ పున్నుల వ్యవహారం కొనసాగుతుందా.. రాహుల్ తర్వాత వీడియోలు ఏంటీ ఇలా రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే అసలు రాహుల్ కు బిగ్ బాస్ ఇచ్చిన పారితోషికం ఎంత.. ప్రైజ్ మనీ ట్యాక్స్ లు పోను ఎంత మిగిలింది.. మొత్తంగా రాహుల్ బిగ్ బాస్ అనే రియాల్టీ షో ద్వారా సంపాదించింది ఎంత అనే చర్చ సోషల్ మీడియాలో చాలా ప్రముఖంగా వినిపిస్తుంది.

ఇదే విషయాన్ని రాహుల్ వెళ్లిన ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఆయన్ను అడుగుతున్నారట. ఒక ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ బయట ప్రచారం జరుగుతున్నట్లుగా బిగ్ బాస్ కు వెళ్లినందుకు నాకు అంత పారితోషికం ఏమీ రాలేదన్నాడు. ఎంత వచ్చింది అనే విషయాన్ని నేను చెప్పనంటూనే చిన్న హింట్ ఇచ్చాడు. అంతా అనుకుంటున్నట్లుగా భారీ మొత్తం అయితే నాకేం దక్కలేదని ఆయన చెప్పుకొచ్చాడు.

ఆయన మాటలను బట్టి.. కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రాహుల్ బిగ్ బాస్ ఇంట్లోకి వారంకు లక్ష రూపాయల పారితోషికం చొప్పున వెళ్లాడట. రాహుల్ చివరి వరకు బిగ్ బాస్ ఇంట్లో కొనసాగాడు కనుక అవి ఒక 15 లక్షలు రాగా ప్రైజ్ మనీ 50 లక్షలు వచ్చింది. ప్రైజ్ మనీలో ట్యాక్స్ లు జీఎస్టీలు అంటూ దాదాపుగా 15 లక్షలకు మించి వెళ్లి పోయిందట. అలాగే రాహుల్ కు వచ్చిన పారితోషికంలో కూడా ట్యాక్స్ లు పోను తక్కువే మిగిలిందట.

ఇక బిగ్ బాస్ వెళ్లే సమయంలో వచ్చిన తర్వాత హడావుడికి కొంత ఖర్చు అయ్యి ఉంటుందని.. చివరకు రాహుల్ కు మిగిలింది 40 నుండి 45 లక్షల వరకే అయ్యి ఉంటుందని నెటిజన్స్ అంచనాలు వేస్తున్నారు. ఆ డబ్బుతో ఒక అపార్ట్ మెంట్ లో సొంత ఫ్లాట్ ను రాహుల్ తీసుకోవాలని భావిస్తున్నాడు. అదే సమయంలో కొంత మొత్తాన్ని సొంత సెలూన్ ఏర్పాటుకు కూడా ఖర్చు చేసే యోచనలో ఉన్నాడంటూ సన్నిహితులు చెబుతున్నారట. డబ్బుల విషయం ఏమో కాని రాహుల్ కు బిగ్ బాస్ వల్ల మంచి ఫేమ్ అయితే దక్కింది.
Please Read Disclaimer