హీరో బుగ్గలు గిల్లి ఎంత పని చేసింది!

0

యు ఆర్ సో క్యూట్ .. యు ఆర్ సో హ్యాండ్సమ్!! అంటూ మహేష్ ని ఆటపట్టించింది రష్మిక. అది కూడా పెద్ద తెర పైన ఓ పాటలో అలా చేసింది. కానీ ఇక్కడ సీన్ అలా లేదు. యు ఆర్ సో క్యూట్.. యు ఆర్ సో నాటీ!! అంటూ ఆ వీరాభిమాని నాగశౌర్య బుగ్గలు పట్టుకుని కందేలా గిల్లింది మరి. అయితే అదంతా కేవలం అభిమానంతో చేసినదే. ఆ ఫ్యాన్ క్యూట్ లవ్ లీ ఎక్స్ ప్రెషన్స్ కి శౌర్య ఏం కర్మ ఆ సీన్ చూసిన వాళ్లంతా ఫిదా అయిపోయారు.

సదరు లేడీ ఎవరో కానీ నాగశౌర్యకు ఎంత వీరాభిమానినో చూస్తుంటేనే అర్థమవుతోంది. పసుపు రంగు కుర్తా చుడీదార్ ధరించి అమాయకత్వం కలబోసిన చూపులతో శౌర్య పై అభిమానం ప్రదర్శించింది. హీరోల్ని చూస్తే ఫ్యాన్స్ ఎంత ఎగ్జయిట్ అవుతారో చెప్పేందుకు ఇంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం అవసరం లేదు.

శౌర్య బుగ్గలు గిల్లింది. హగ్ చేసుకుంది. సెల్ఫీలు దిగింది. ఇక ఇతర లేడీ ఫ్యాన్స్ తో పోలిస్తే తను ఎంతో క్యూట్ గా తన ప్రేమాభిమానాల్ని వ్యక్తం చేసి అందరి పెదవులపై చిరునవ్వులు రప్పించింది. ఇంతకుముందు బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కోసం ముంబై వీధులన్నీ తిరుగుతూ చివరకు ఏదోలా వెతుక్కుంటూ వచ్చిన ఓ వీరాభిమాని ఏకంగా ఇంటి గేటు ఎదుట.. మోకాళ్ల పై కూచుని ఐ లవ్ యు అంటూ తన ప్రేమను వ్యక్తం చేసిన వీడియో ఇలానే షాకిచ్చింది. ఇలాంటి ఘటనలు రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. తమ ఫేవరెట్ స్టార్లను చూస్తే కొందరు అభిమానులు ఇట్టే ఎగ్జయిట్ అయిపోతారు అనడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. నాగశౌర్య నటించిన `అశ్వథ్థామ` నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజైన సంగతి తెలిసిందే. ప్రమోషన్ కార్యక్రమాల్లో హ్యాండ్సమ్ హీరో శౌర్య లేడీ ఫ్యాన్స్ అంతా ఇలా బయటపడుతున్నారు మరి.
Please Read Disclaimer