45 ఏజ్ మ్యాకోమ్యాన్ నం.1 హృతిక్

0

లేటు వయసులోనూ యూత్ లో అసాధారణ క్రేజుతో వేడి పెంచే హీరోల జాబితా తిరగేస్తే అందులో నంబర్ -1 ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే ఆన్ లైన్ పోల్ లో తేలిన విషయం ఇదీ. 45 వయసులోనూ ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన మ్యాచో మ్యాన్ గా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పేరును యూత్ ఎంపిక చేశారు. హాలీవుడ్ స్టార్లు టామ్ క్రూజ్.. రాబర్ట్ పాటిసన్ .. క్రిస్ ఇవాన్స్ .. ఫుట్ బాల్ ఆటగాడు డేవిడ్ బెక్ హాం వంటి వారిని సైతం వెనక్కి నెట్టి టాప్ పొజిషన్ ని దక్కించుకున్నాడు హృతిక్. అతడికి ఈ ప్రత్యేకమైన గౌరవం దక్కడంతో అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. ఈ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఇన్ స్టాలో హృతిక్ స్పందన ఆసక్తికరం.

ఒకవేళ నేను అందగాడిలాగా గొప్పగా కనిపిస్తానంటే.. అలాంటి పొగడ్త నన్ను చెడ్డవాడిగా మార్చేస్తుందేమో! అంటూ వ్యాఖ్యానించాడు. అభిమానులు నాకు ఇంత గొప్ప టైటిల్ ఇచ్చినందుకు థాంక్స్ కానీ.. అదొక పెద్ద అఛీవ్ మెంట్ అని నేను అనుకోను! అని అన్నారు హృతిక్. ఈ లోకంలో అన్నిటి కన్నా పది మందీ మెచ్చాల్సినది వేరొకటి ఉంది. “ఇది నాకు కావాలి అని కోరుకునేది అందం కంటే ఒక మంచి క్యారెక్టర్ ఉన్నవాడు“ అని పిలిపించుకోవడమే గొప్ప విషయం. అదే నాకు విలువను పెంచేది. సంతృప్తిని ఇచ్చేది. ఒక మంచి క్యారెక్టర్ ఎప్పుడూ ఆకర్షణను పెంచుతుంది.. అని తెలిపారు.

కెరీర్ పరంగా చూస్తే .. హృతిక్ నటించిన సూపర్ 30 ఘనవిజయం సాధించింది. తదుపరి వరుసగా భారీ చిత్రాలకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో క్రిష్ 4 చిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సత్తే పా సత్తా రీమేక్ లోనూ హృతిక్ నటించనున్నారు. ఫరాఖాన్ దర్శకత్వంలో ఓ సౌత్ రీమేక్ లో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Please Read Disclaimer