‘సైరా’ స్టార్ పై ‘వార్’ స్టార్ కామెంట్

0

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `సైరా-నరసింహారెడ్డి` అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు-తమిళ వెర్షన్లకు ధీటుగా హిందీ వెర్షన్ ని అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి బాహుబలి స్ట్రాటజీని అనుసరిస్తూ ప్రచారం చేస్తుండడంతో అటు ముంబై మీడియాలోనూ దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటీవలే రిలీజ్ చేసిన `సైరా` టీజర్- మేకింగ్ వీడియోలకు బాలీవుడ్ మీడియా సహా అక్కడ ప్రముఖుల ప్రశంసలు దక్కాయి.

అంతా బాగానే ఉంది కానీ.. సైరాకు బాలీవుడ్ లో ఠఫ్ కాంపిటీషన్ ఎదురవుతుండడంపైనా అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. అక్కడ కండల హీరోలు హృతిక్ రోషన్ – టైగర్ ష్రాఫ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం `వార్` .. అదేరోజు రిలీజవుతోంది. దీంతో ఇరు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ తప్పడం లేదు. ప్రస్తుతం హృతిక్ రోషన్ `వార్` ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ టైమ్ లోనే హృతిక్ పాత ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వంపై హృతిక్ ప్రశంసలు కురిపించారు.

హృతిక్ మాట్లాడుతూ..“చిరంజీవి గారిని నా లైఫ్ లో ఎన్నోసార్లు కలిశాను. ఆయనో పెద్ద స్టార్. స్టార్ డమ్ ని మించి మానవత.. గొప్ప స్నేహస్వభావం ఉన్న నటుడు. ఒకసారి ఐఫా వేడుకల్లో నేను స్వయంగా ఓ పార్టీ ఇచ్చాను. ఆ పార్టీకి చిరంజీవి గారు హాజరయ్యారు. అంతేకాదు.. పార్టీకి వచ్చిన అతిధులకు ఆయనే వడ్డనలు చేశారు. వినయవిధేయతల్లోనే కాదు.. గౌరవం ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనూ చిరంజీవిగారు స్ఫూర్తి. ఇతరులపై ఆయన చూపించే ప్రేమ నన్ను ఎంతగానో హత్తుకుంది“ అంటూ ప్రశంసలు కురిపించారు.
Please Read Disclaimer