`సూపర్ 30` ఊహించనిదొకటి..!?

0

ఇటీవల సినిమాల్ని క్రిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ.. ఆడియెన్ పాయింట్ ఆఫ్ వ్యూ! అంటూ విడదీసి చూస్తున్నారు. క్రిటిక్స్ పొగిడేసినంత మాత్రాన హిట్టు అవ్వడం లేదు. క్రిటిక్స్ తిట్టేసినంత మాత్రాన ఫ్లాపు అవ్వడం లేదు. రివ్యూల ప్రభావం కొంతవరకే. ఆడియెన్ మౌత్ టాక్ లు.. సోషల్ మీడియా- యూట్యూబ్ ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. ఇంతకీ హృతిక్ నటించిన `సూపర్ 30`కి బాలీవుడ్ సమీక్షకులు ఎలాంటి రేటింగులు వేశారు? సినిమాపై ఎలాంటి కామెంట్స్ చేశారు? అని వెతికితే ఆసక్తికర సంగతులే తెలిశాయి.

`సూపర్ 30` కథాంశం గొప్పది. హృతిక్ నటన అద్భుతంగా ఉంది. కానీ .. రకరకాల సందేహాలున్నాయి! అంటూ పలువురు సమీక్షల్లో రాసుకొచ్చారు. అసలు గణిత శాస్త్ర మేధావి అయిన ఆనంద్ కుమార్ ఇలా లేడు! హృతిక్ రంగు గోధుమ వర్ణం అయితే .. ఆనంద్ రంగు వేరే! అసలు హృతిక్ ని ఎంపిక చేసుకోవడం అన్నది స్టార్ డమ్ కోసం మాత్రమేనని విమర్శించిన వాళ్లు ఉన్నారు. అయితే సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ కి ఆడియెన్ కనెక్టవుతారని.. డీగ్లామరస్ పాత్రలో హృతిక్ షటిల్డ్ గా నటించారని ప్రశంసలొచ్చాయి. దర్శకుడు వికాస్ బాల్ ప్రయత్నం బావుందని ప్రశంసించారు.

అయితే హృతిక్ నటించిన ధూమ్ సిరీస్.. క్రిష్ సరీస్ లా ఈ సినిమా మ్యాసివ్ గా బాక్సాఫీసుల్ని బద్ధలు కొట్టేస్తుందా? అంటే ఆ రేంజు కమర్షియల్ సినిమా అయితే కాదు. కొన్ని కోణాల్లో ప్రశంసలు దక్కినా.. మాస్ లో దూసుకుపోయే సీన్ లేదు. హృతిక్ నటించిన గుజారిష్.. కాబిల్ చిత్రాల తరహాలోనే ఇదో ఇంట్రెస్టింగ్ ఎటెంప్ట్. హృతిక్ ని ఎలివేట్ చేసే సినిమానే. కానీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసేస్తుందని భావించలేం అన్న విశ్లేషణ సాగింది. 3 స్టార్ రేటింగ్ ఇచ్చినంత మాత్రాన బంపర్ హిట్ అని చెప్పలేం. ఈసారి మిశ్రమ ఫలితమే. అయితే హృతిక్ కి పేరొస్తుంది! అని ఫైనల్ గా తేల్చి చెప్పారు.
Please Read Disclaimer