మహేష్ కోసం భారీ ఖర్చుతో బ్యాంకు సెట్.. సిద్దమైందా..?

0

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ మరోసారి తన బాక్సాఫీస్ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నాడు. పరశురామ్ – మహేష్ బాబుల కాంబినేషన్ ఖచ్చితంగా వెరైటీగా ఉండబోతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ సర్కారు వారి పాట టైటిల్ అయితే విపరీతంగా బజ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా చిత్ర యూనిట్ టైటిల్ పోస్టర్ విడుదల చేయగానే ప్రేక్షకుల నుండి ఊహించని రేంజిలో స్పందన లభించింది. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల పోస్టర్ విడుదల కాగా ఇందులో మహేష్ లాంగ్ హెయిర్ లైట్ బియర్డ్ తో ఇంతక ముందెప్పుడూ చూడని మాస్ లుక్లో కనిపించి కిక్ ఇచ్చాడు.

ఇటీవలే ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది? అనే సందేహం అందరిలో ఉంది. అయితే ఈ సినిమా ఆర్థిక నేరాల బ్యాక్డ్రాప్తో బ్యాంకు చుట్టూ తిరుగుతుందని సమాచారం. బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో సామాజిక అంశాలను చర్చలోకి తీసుకొస్తుందట. ఈ సినిమాలో హీరో ఓ బ్యాంకు మేనేజర్ గా కనిపించనున్నాడని టాక్. అయితే తాజా సమాచారం ప్రకారం.. పరశురామ్ టీమ్ ఈ సినిమాకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో బ్యాంకు సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లోనే మాక్సిమం షూటింగ్ అయిపోతుందని అంటున్నారు. సెట్ కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు పెడుతున్నారట. షూటింగ్ తేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాను మైత్రి మూవీస్ తో పాటు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్.. 14రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మించనున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
Please Read Disclaimer