కామ్రేడ్ కి అక్కడ అలా చెక్

0

ప్రస్తుతం ఏ నోట విన్నా రౌడీ గురించిన ముచ్చటే. `అర్జున్ రెడ్డి`గా అన్ని భాషల్లో విజయ్ దేవరకొండ పాపులారిటీ గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా ఇరుగు పొరుగు భాషల్లో రీమేకవుతుండడంతో ప్రతిసారీ దేవరకొండ పేరు ప్రస్థావనకు వస్తోంది. అలా ఇప్పటికే బోలెడంత పాపులారిటీ వచ్చింది. దీనికి ఫైర్ యాడెడ్ టు ద పెట్రోల్! అన్న చందంగా దేవరకొండ ఎంతో ఎనర్జిటిక్ గా తన సినిమాల్ని పొరుగు భాషల్లో ప్రచారం చేసుకుంటున్నాడు. చెన్నయ్ .. బెంగళూరు.. ముంబై వంటి చోట్లా తాజా సినిమా `డియర్ కామ్రేడ్` కి ఇప్పటికే బోలెడంత ప్రచారం వచ్చింది. మెట్రో నగరాల్లో అన్ని మల్టీప్లెక్సుల్లోనూ టిక్కెట్ విండోలు జామైపోయే ప్లాన్ చేశాడు దేవరకొండ.

ఆ క్రమంలోనే `డియర్ కామ్రేడ్`పై అటు చెన్నయ్ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే ఈ సినిమా రిలీజవుతున్న రోజు (జూలై 26)న తమిళంలోనూ కొన్ని క్రేజీ చిత్రాలు రిలీజవుతున్నాయి. వీటన్నిటికీ కామ్రేడ్ ఏమేరకు పోటీనిస్తాడోనన్న చర్చా ట్రేడ్ లో సాగుతోంది. తమిళంలో మొత్తం ఆరు సినిమాలు పోటీపడనున్నాయి. కమెడియన్ సంతానం నటించిన ఏ1.. లేడీ సూపర్ స్టార్ నయనతార -కొలైయుధిర్ కాలం.. దర్శక హీరో సముద్ర ఖని -కొలాంజి.. వీటితో పాటు నుంగంబాకం.. చెన్నై పళని మార్స్.. ఆరడి చిత్రాలు విడుదలవుతున్నాయి. వీటిలో ఏ1 కొలైయుధిర్ కాలం చిత్రాలకు భారీ క్రేజు నెలకొంది. ఆ క్రమంలోనే వీటన్నిటితో పోటీపడుతూ కామ్రేడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు? అన్నది ఆసక్తిగా మారిందట.

అటు మలయాళం.. కన్నడంలోనూ కొన్ని చిన్న సినిమాలు రిలీజవుతున్నాయి. లాంగ్ సైట్ – పోరాటం-కడలసుపులి- నమస్తే ఇండియా- తనీర్ మదన్ దినంగల్ లాంటి మలయాళ చిత్రాలు జూలై 26న రిలీజవుతున్నాయి. అయితే ఇవేవీ సూపర్ స్టార్లు నటించినవి కావు కాబట్టి ఆ మేరకు డియర్ కామ్రేడ్ కి మెట్రో నగరాల్లో వచ్చిన ఇబ్బందేమీ లేదన్న ముచ్చట సాగుతోంది. కన్నడలో మోక్ష- రిలాక్స్ సత్య- బటర్ ఫ్లై- ఇన్ స్పెక్టర్ విక్రమ్- భిన్న అనే చిన్న సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ సినిమాలు కామ్రేడ్ కి ఎంత పోటీనిస్తాయి? అన్నది చూడాలి. ఇకపోతే బెంగళూరు.. చెన్నయ్ వంటి చోట్ల కామ్రేడ్ ప్రచారం దృష్ట్యా వసూళ్లకు డోఖా ఉండదని అంచనా వేస్తున్నారు.
Please Read Disclaimer