ఇస్మార్ట్ గా రౌండప్ చేశారు!

0

“ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా!“ .. `బిజినెస్ మేన్` చిత్రంలోని పంచ్ డైలాగ్ ఇది. మహేష్ హీరోగా నటించిన ఆ సినిమా తీసింది పూరి జగన్నాథ్. ఆయనే ఇప్పుడు రామ్ హీరోగా `ఇస్మార్ట్ శంకర్` ని తీస్తున్నారు. ఈ సినిమాని ఇస్మార్ట్ గా రౌండప్ చేశారనే తాజా సన్నివేశం చెబుతోంది. సోలో రిలీజ్ తో హిట్టు కొట్టాలన్న పూరి ఆశలపై నీళ్లు చల్లుతూ వచ్చే వారం ఏకంగా నాలుగైదు సినిమాలు పోటీ బరిలో దిగుతున్నాయి.

జూలై 18న `ఇస్మార్ట్ శంకర్` చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని పూరి లాంటి స్టార్ డైరెక్టర్ ప్రకటించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అదే రోజు పోటీగా కార్తికేయ నటించిన `గుణ 369` .. చియాన్ విక్రమ్ నటించిన `మిస్టర్ కెకె` రిలీజవుతున్నాయి. చాలా కాలంగా రిలీజ్ కి నోచుకోక పెండింగులో ఉన్న సంపూర్ణేష్ బాబు `కొబ్బరి మట్ట` కూడా ఏమాత్రం జంకు అన్నదే లేకుండా రిలీజైపోతోంది. వీళ్లు సరిపోరు అన్నట్టే అమలాపాల్ నటించిన డబ్బింగ్ సినిమా `ఆమె` కూడా అదే రోజు రిలీజవుతోంది. ఈ పోటీ చూస్తుంటే శంకర్ ని ఇస్మార్ట్ గానే రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారని అర్థమవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన మిస్టర్ కెకె .. అమలాపాల్ నగ్నంగా (బోల్డ్) గా నటించిన ఆమె (ఆడై) చిత్రాలు డబ్బింగులే అయినా ఇవి స్ట్రెయిట్ సినిమా `ఇస్మార్ట్ శంకర్`కి గట్టి పోటీనే ఇవ్వనున్నాయని అర్థమవుతోంది.

ఇక ఆర్.ఎక్స్ 100 తర్వాత కార్తికేయ నటించిన `హిప్పీ` ఫ్లాపవ్వడంతో ఈసారి ఎట్టి పరిస్థితిలో హిట్ కొట్టాలన్న కసితో వస్తున్నాడు. అతడు నటించన `గుణ 369` డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోందని ప్రచారమవుతోంది. మరి ఈ సినిమాలన్నిటికీ ఎనర్జిటిక్ రామ్ – పూరి జగన్నాథ్ కాంబో మూవీ `ఇస్మార్ట్ శంకర్` ఎలాంటి పోటీని ఇవ్వబోతోంది? అన్నది చూడాలి. కొన్ని వరుస పరాజయాల తర్వాత పూరి- రామ్ జోడీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు చాలానే హార్డ్ వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ కష్టం ఎంతవరకూ బాక్సాఫీస్ వద్ద ప్రతి ఫలిస్తుంది అన్నది వేచి చూడాలి.
Please Read Disclaimer