సాహో అనిపిస్తున్న ఎడ్వాన్స్ బుకింగ్!

0

ప్రభాస్ కొత్త సినిమా ‘సాహో’ ఆగష్టు 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఆన్లైన్ లో టికెట్ బుకింగ్స్ మొదలు పెట్టారు.. సినిమాప్రియులు జోరుగా టికెట్లను బుక్ చేసుకోవడం ప్రారంభించారు. విడుదలకు ఐదు రోజులు ఉన్నప్పటికీ ‘ఆలసించిన ఆశాభంగం’ తరహాలో ఎడాపెడా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో అందరూ మొదటిరోజే ఈ సినిమాను చూడాలని కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తోంది.

ప్రముఖ ఆన్ లైన్ టికెటింగ్ సైట్ లో హైదరాబాద్ టికెట్ ట్రెండ్స్ పరిశీలిస్తే మొదటిరోజు టికెట్స్ దాదాపు 90% అమ్ముడుపోయాయి. హిందీ.. తెలుగు వెర్షన్లకు కలిపి హైదరాబాద్ లో ఇప్పటివరకూ 136 స్క్రీన్స్ కు అడ్వాన్సు బుకింగ్ ఓపెన్ చేస్తే 122 స్క్రీన్స్ లో దాదాపు టికెట్స్ అయిపోయాయి. మిగతా థియేటర్లలో కూడా జోరుగా అమ్ముడుపోతున్నాయి. ఇంకా కొన్ని స్క్రీన్స్ లో టికెట్ బుకింగ్ ఓపెన్ చెయ్యలేదు. ఇదురోజుల ముందే పరిస్థితి ఇలా ఉంటే రిలీజ్ డేట్ కు దగ్గరయ్యే కొద్దీ టికెట్ల డిమాండ్ మరింతగా పెరగడం ఖాయం.

ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే పలు ఇతర నగరాల్లో కూడా పరిస్థితి అలానే ఉంది. ఇప్పటికే టికెట్ బుకింగ్ ఓపెన్ చేసిన థియేటర్లలో దాదాపు 80% థియేటర్స్ హౌస్ ఫుల్. మిగతా థియేటర్లలో కూడా 80% సీట్స్ ఫుల్ అయ్యాయి. రెండు రోజులు గడిస్తే ఈ థియేటర్లలో ఒక్క టికెట్ కూడా ఆన్ లైన్ లో దొరికే పరిస్థితి లేదు. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న థియేటర్స్ కాకుండా కొత్తవి అందుబాటులోకి వస్తే తప్ప టికెట్లు దొరకడం కష్టం అవుతుంది. టికెట్ బుకింగ్స్ జోరు చూస్తుంటే డార్లింగ్ మొదటిరోజు బాక్స్ ఆఫీసును బుల్ డోజర్ తో వెళ్లి గుద్దేలా ఉన్నాడు.
Please Read Disclaimer