రూలర్ ఈవెంట్ కి భారీగా ఫ్యాన్స్?

0

ఇటీవలి కాలంలో స్టార్ హీరోల ఆడియో ఫంక్షన్లు.. ప్రీరిలీజ్ వేడుకలు అంటే భారీగా అభిమాన బలగం దిగిపోతున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న `సాహో` ప్రీరిలీజ్ కోసం డార్లింగ్ ప్రభాస్ అభిమానులు.. సైరా ప్రీఈవెంట్ కోసం మెగాస్టార్ చిరంజీవి అభిమానులు భారీగా వచ్చారు. వేలాదిగా వచ్చిన అభిమానులతో స్టేడియమ్ లు కిక్కిరిపోయాయి. పాన్ ఇండియా అంటూ ఆ ఇద్దరు స్టార్ల ఫ్యాన్స్ చేసిన హంగామా మామూలుగా లేదు.

ప్రస్తుతం మరో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న `రూలర్` ఈవెంట్ కి టైమ్ దగ్గర పడింది. ఇప్పటికే చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతున్న సంగతి తెలిసిందే. పెండింగ్ చిత్రీకరణలతో పాటు మరో వైపు నిర్మాణానంతర పనులు సైమల్టేనియస్ గా పూర్తవుతున్నాయి. డిసెంబర్ 20న సినిమా రిలీజవుతుందని తేదీని ప్రకటించేయడం తో ఇక పెండింగ్ బ్యాలెన్స్ అన్ని పనుల్ని వేగంగా పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. రిలీజ్ కి సరిగ్గా మరో పాతిక రోజుల సమయం కూడా లేదు. అందుకే ఈ సినిమా ప్రచారాన్ని హీటెక్కించే ఆలోచన లో బాలపాటి బృందం ఉన్నారట.

తాజా సమాచారం ప్రకారం.. డిసెంబర్ 15న అత్యంత భారీగా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించనున్నారని తెలుస్తోంది. సరిగ్గా రిలీజ్ కి ఐదు రోజుల ముందు ఈ వేడుకను నిర్వహిస్తుండడం ఆసక్తికరం. ఇక ఈ వేడుకకు వేలాదిగా నందమూరి అభిమానులు విచ్చేస్తారని తెలుస్తోంది. ఇంతకుముందు ఎన్టీఆర్ బయోపిక్ ప్రీరిలీజ్ ప్రమోషన్స్ కి నందమూరి ఫ్యాన్స్ భారీగా విచ్చేశారు. ఈసారి కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఈ వేడుకకు ఎటెండవుతారని అంటున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ పరాజయం బాలయ్యను తీవ్రంగా నిరాశపరిచింది. అందుకే ఆయన మాంచి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలన్న కసితో ఆవురావురుమని ఉన్నారు. అందుకు తగ్గట్టే రూలర్ కోసం ఎంతగానో శ్రమించారు. ఇందు లో పోలీస్ అధికారిగా.. ఫ్రెంచి గడ్డంతో రొమాంటిక్ బోయ్ గానూ బాలయ్య నటిస్తున్నారు. ఇటీవలే రిలీజైన టీజర్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer