వర్షం వల్ల పవన్ 27 మూవీకి రూ. 1 కోటి నష్టం??

0

పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు ‘వకీల్ సాబ్’ చిత్రం పూర్తి చేస్తాడా అంటూ దర్శకుడు క్రిష్ ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే పవన్ తో చేయబోతున్న మూవీకి సంబంధించిన షూటింగ్ ను పవన్ లేకుండానే మొదలు పెట్టాడు. పవన్ లేకుండా ఇతర నటీనటుల కాంబో సీన్స్ ను చిత్రీకరించిన క్రిష్ ‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ డేట్లు ఇస్తే షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఈ మహమ్మారి వైరస్ కారణంగా పవన్ క్రిష్ ల మూవీ ఆలస్యం అయ్యింది. ఈ చిత్రం కోసం అల్యూమీనియం ఫ్యాక్టరీలో భారీ ఎత్తున ఒక సెట్ ను క్రిష్ వేయించాడు.

సినిమాలోని కీలక సన్నివేశాలు ఆ సెట్ లో జరగాల్సి ఉన్నాయట. సముద్రం ఇంకా భారీ ఓడ సెట్ ను అల్యూమీనియం ఫ్యాక్టరీలో దాదాపుగా కోటిన్నర పెట్టి క్రిష్ వేయించాడు. తాజాగా భారీ వర్షాలు కురియడంతో ఆ సెట్ మొత్తం నాశనం అయ్యిందట. దాంతో ఏకంగా కోటి రూపాయల నష్టంగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ విషయమై పవన్ 27 యూనిట్ సభ్యుల నుండి ఎలాంటి అధికారిక క్లారిటీ అయితే రాలేదు.

దాదాపు మూడు నెలల విరామం తర్వాత వకీల్ సాబ్ చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. పవన్ కళ్యాణ్ ఒకటి రెండు రోజుల్లో వకీల్ సాబ్ చిత్రీకరణలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ నెలాకరు వరకు లేదంటే జులై మొదటి వారం వరకు వకీల్ సాబ్ పూర్తి అయితే ఆగస్టు నుండి క్రిష్ మూవీ మొదలు పెట్టాలనుకున్నాడు. ఆ సెట్ లోనే పవన్ తో షూటింగ్ ను మొదలు పెట్టాలని క్రిష్ అనుకున్నాడట. కాని ఇంతలోనే ఆ భారీ సెట్ వర్షార్పణం అయ్యింది అంటూ ఇండస్ట్రీలో టాక్.
Please Read Disclaimer