భారీ చిత్రాలు.. దర్శకుల భారీ గడ్డాలు.!

0

జేమ్స్ కామెరోన్ రాజమౌళి సురేందర్ రెడ్డి.. హాలీవుడ్ బాలీవుడ్ దిగ్గజ దర్శకులు.. ఇలా భారీ చిత్రాలు తీసే దర్శకులందరిలోనూ ఒక పోలిక ఉంది గమనించారా.? అదే జులపాల జుట్టు.. భారీ గడ్డం.. సినిమా నిర్మాణంతో యోగిలా మారిపోయి.. ఆ సినిమాలోనే లీనం అయిపోయి వీరంతా గడ్డాలు మీసాలు జుత్తు పెరిగినా కట్ చేసుకోకుండా కర్మ యోగుల వలే కనిపిస్తుంటారు..

జేమ్స్ కామెరోన్ కానీ హిందీలో సంజయ్ లీలా భన్సాలీ కానీ.. ఇక తెలుగులో రాజమౌళి సురేందర్ రెడ్డిలు ఇలా భారీ చిత్రాలు తీసేవాళ్లంతా సినిమా తీసేటప్పుడు ఇలానే కనిపించారు.

బాహుబలి.. భారీ చిత్రం.. దేశమే కాదు.. ప్రపంచాన్నే అద్భుతపరిచిన ఈ చిత్రం దర్శకుడు రాజమౌళికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. అయితే ఐదేళ్ల పాటు కఠోర దీక్షతో తిండి నిద్ర లేకుండా సినిమా గురించే ఆలోచిస్తూ సినిమానే శ్వాసగా ఓ యజ్ఞంలో రాజమౌళి తీశాడు. అందులో భాగంగానే సినిమా పూర్తయ్యేసరికి గడ్డం మీసం తీసుకోకుండా ఓ రుషిలా మారిపోయాడు..

రాజమౌళి గురించి ఆయన భార్య రమ రాజమౌళి కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ‘రాజమౌళికి మతిపరుపు ఎక్కువ. సినిమా తీసేటప్పుడు అయితే ఏది ఎక్కడ పెడుతాడో కూడా గుర్తుండదు. దానికోసం ఇళ్లు సెట్ అంతా వెతుకుతాం.. సినిమాలో లీనం అయిపోతే రాజమౌళిని బయటకు తీసుకురావడం కష్టం’ అంటూ ఆయన జిజ్ఞాసను చెప్పుకొచ్చింది.

ఇక మొన్నటికి మొన్న ‘సైరా’ను చేపట్టిన దర్శకుడు సురేందర్ రెడ్డిది కూడా ఇదే గడ్డం మీసం స్టైల్. ఆయన చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రాన్ని హిట్ కొట్టించడం కోసం ఎంతో కష్టపడ్డాడు. ఆ సినిమా సమయంలోనే భారీగా గడ్డం మీసం జట్టు పెంచి కర్మయోగిలా మారిపోయారు.

ఇలా భారీ చిత్రాలు తీసే దర్శకులందరూ యథాలాపంగా గడ్డాలు మీసాలు పెంచుతూ కనిపించడం యాధృశ్చికమే అయినా అదో తపస్సులా వారి సినిమా అభిలాషను మనకు తెలియపరుస్తోంది.




Please Read Disclaimer