`మన్మధుడు 2` శాటిలైట్ ఎంతకు?

0

కింగ్ నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `మన్మధుడు 2`. రకుల్ ప్రీత్ కథానాయిక. సమంత- కీర్తి సురేష్- అక్షర గౌడ అతిధి పాత్రల్లో మెరవనున్నారు. చి.ల.సౌ ఫేం రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 9న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ కి ఇంకో 15 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఆ క్రమంలోనే ఈ సినిమాకి ప్రచారంలోనూ స్పీడ్ పెంచింది టీమ్.

ఇటీవలే టీజర్ రిలీజై ఆకట్టుకుంది. టైటిల్ కి తగ్గట్టే నాగార్జున మరో లెవల్లో భామలతో రొమాన్స్ చేయబోతున్నారని ఈ టీజర్ తో యూత్ కి స్ట్రైక్ అయ్యింది. అలాగే ఇటీవల రిలీజైన మన్మధుడు2 సింగిల్స్ ఆకట్టుకుంటున్నాయి. `మెనీనా..` సాంగ్ ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది. ప్రభాస్ `సాహో` ఆగస్టు 30కి వాయిదా పడడం ఈ సినిమాకి మరో ప్లస్. ప్రచారార్భాటానికి తగ్గట్టే ఈ సినిమాకి బిజినెస్ పరంగానూ కలిసొస్తోందని తాజా డీల్స్ చెబుతున్నాయి.

మొన్న డిజిటల్ రైట్స్.. నేడు శాటిలైట్ డీల్ పూర్తవ్వడం మన్మధుడి స్పీడ్ కి సింబాలిక్ గా కనిపిస్తోంది. మొన్ననే డిజిటల్ రైట్స్ ని ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ 7.4కోట్లకు దక్కించుకుంది. అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ 6.1 కోట్లు పలికాయని తెలుస్తోంది. తాజాగా శాటిలైట్ రైట్స్ కి సంబంధించిన సమాచారం అందింది. మన్మధుడు 2 శాటిలైట్ హక్కుల్ని స్టార్ మా 8.3 కోట్లకు చేజిక్కించుకుందని తెలుస్తోంది. ఇప్పటికే కింగ్ స్టార్ మాలో `బిగ్ బాస్ 3` రియాలిటీ షోకి హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే అదే చానెల్ కి మన్మధుడు 2 రైట్స్ ని విక్రయించడం ఆసక్తికరం.
ఇక మన్మధుడు 2 థియేట్రికల్ బిజినెస్ సహా ఆడియో రైట్స్ తదితర సంగతులు రివీల్ కావాల్సి ఉంది. మన్మధుడు 2 స్టోరి లైన్ ఇంట్రెస్టింగ్. లేటు వయసు బ్రహ్మచారి లవ్ స్టోరీస్.. అటుపై పెళ్లి ప్రయత్నాలు ఎలా సాగాయి? ఆ క్రమంలోనే పుట్టుకొచ్చిన ఫన్ ఎంటర్ టైన్ మెంట్ నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ ఇదని తెలుస్తోంది.
Please Read Disclaimer