భీష్మ కు భారీ టేబుల్ ప్రాఫిట్స్?

0

‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్.. రష్మిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాకు నిర్మాతలు. ఫిబ్రవరి 21 న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. ప్రోమోస్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమా పై బజ్ ఏర్పడింది.

సినిమాకు హైప్ ఉండడంతో ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగిందని సమాచారం. సినిమాకు 22 కోట్ల బడ్జెట్ అయిందని చెప్తున్నారు కానీ ఆ స్థాయిలో ఖర్చు కాలేదట. దాంతో సంబంధం లేకుండా నితిన్ కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా హైయ్యస్ట్ రేషియోలో బిజినెస్ జరిగిందని ట్రేడ్ టాక్. థియేట్రికల్.. నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపితే నిర్మాతలకు దాదాపు 18 కోట్లు టేబుల్ ప్రాఫిట్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఒక మీడియం రేంజ్ సినిమాకు ఇవి భారీ స్థాయి లాభాలు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమయం అనుకూలించి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధిస్తే సితార వారికి పంట పండినట్లేనని అంటున్నారు.

అనంత్ నాగ్.. వెన్నెల కిషోర్.. సత్య.. రాజీవ్ కనకాల.. సంపత్ రాజ్.. రఘుబాబు.. బ్రహ్మాజీ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈమధ్య ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న నితిన్ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడేమో వేచి చూడాలి.
Please Read Disclaimer