ముందు రోజు ప్రీమియర్లు లాభమా నష్టమా ?

0

క్యాలెండర్ లో 30 డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు సినిమా ప్రేమికులు. టాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ వండర్ సాహో ప్రపంచవ్యాప్త విడుదల ఆ రోజు కావడంతో దేశం మొత్తం ఇదే తరహా బజ్ ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇప్పటికే థియేటర్లు విపరీతంగా వచ్చే రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు అదనపు సిబ్బంది నియామకం చేసుకుంటున్నాయి. బ్లాక్ బస్టర్ టాక్ కనక వస్తే బాహుబలి 2ని మించడం సులభమని లెక్కలు వేస్తున్నారు.

ముందు రోజు అంటే 29 రాత్రే ముఖ్యమైన కేంద్రాల్లో ప్రత్యేక ధరతో ప్రీమియర్ షోలు వేసే ఆలోచనలో యువి ఉన్నట్టుగా ఇప్పటికే లీక్స్ ఉన్నాయి. టికెట్ రేట్ ప్రారంభ ధరే 500 రూపాయలుగా నిర్ణయించి అది భరించగలిగిన ప్రేక్షకులకే ఈ స్పెషల్ షో చూసే కల్పించే అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. దీని గురించి అధికారిక నిర్ణయమైతే వెలువడలేదు. ఒకవేళ అమలులోకి తెస్తే లాభమూ ఉంది కొంత నష్టమూ ఉంది.

లాభం విషయానికి వస్తే ఒక స్క్రీన్ మీద రోజులో నాలుగు షోల ద్వారా వచ్చే రెవిన్యూని కేవలం ఈ ఒక్క ఆట ద్వారా రాబట్టుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాలు ముఖ్య పట్టణాల్లో వేస్తే కనక హౌస్ ఫుల్స్ కావడం ఖాయమే. ఐదు వందలు పెట్టేందుకు అభిమానులు వెనుకాడక పోవచ్చు. అదే జరిగితే ఓ రెండు కోట్లు గ్రాస్ వచ్చే జిల్లాలో పది కోట్లు ఒక్క షోకే వస్తాయి. ఆ యాంగిల్ లో ఇది బ్రహ్మాండమైన స్ట్రాటజీ.

కానీ సినిమా ఎలా ఉందనే టాక్ కంప్లీట్ రిపోర్ట్స్ రివ్యూలు ఆన్ లైన్ తో పాటు సోషల్ మీడియా మొత్తం ఒకరోజు ముందే కమ్మేస్తాయి. బాగుందనే టాక్ వస్తే ఓకే ఆకాశమే హద్దు. ఏ మాత్రం తేడా వచ్చినా ఇబ్బందులు తప్పవు. కంటెంట్ మీద అంత నమ్మకంతో ఉన్నారు కాబట్టి 29న ప్రీమియర్లు వేస్తే మాత్రం అన్ని రకాలుగా ప్లస్సులే ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి ప్రొసీడ్ అవ్వడమే బెటరేమో.
Please Read Disclaimer