ప్రభాస్ కోసం అశ్వనీదత్ అంత బడ్జెట్ పెడతాడా..?

0

డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. దేశవ్యాప్తంగా ప్రభాస్ సినిమాకోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో ప్రభాస్ తో చేసే సినిమాలు భారీ బడ్జెట్ లోనే ఉంటున్నాయి. సాహో తర్వాత ప్రభాస్ – జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. విదేశాలలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందనుందని చిత్రయూనిట్ తెలిపారు.

ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నటించబోతున్నాడని ఆల్రెడీ బహిరంగంగా ప్రకటించారు. అయితే ఈ సంవత్సరం చివరలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నాడట. సైన్స్ ఫిక్షన్ జానర్ కాబట్టి గ్రాఫిక్స్ వర్క్ భారీ లెవెల్లో ఉంటుంది. అందుకే విఎఫ్ ఎక్స్ కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టనున్నాడట నిర్మాత అశ్వినీదత్.

కేవలం విఎఫ్ ఎక్స్ కోసమే 50కోట్లు అంచావేస్తున్నట్లు సమాచారం. మరి విఎఫ్ ఎక్స్ కోసమే హాలీవుడ్ నుండి టెక్నీషియన్లను పిలిపించి అంత ఖర్చు చేస్తే సినిమా మొత్తానికి ఏ రేంజ్ లో బడ్జెట్ కేటాయించనున్నారో ఊహకే అందట్లేదు అంటున్నారు సినీవిశ్లేషకులు. అధికారికంగా ప్రకటన బయటికి రానప్పటికీ సినీ అభిమానులలో – సినీ వర్గాలలో మాత్రం భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమాకోసం హీరోయిన్ ని – ఇతర నటీనటులను ఇంకా ఎంపిక చేయలేదు. త్వరలోనే వెల్లడిస్తామని అశ్వినీదత్ తెలిపినట్లు వినికిడి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-